టీడీపీ అధినేత చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా పడింది.ఈ మేరకు విచారణను శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు ధర్మాసనం వాయిదా వేసింది.
కాగా చంద్రబాబు దాఖలు చేసిన ఎస్ఎల్పీపై గత మూడు రోజులుగా సుప్రీంకోర్టులో సుదీర్ఘ వాదనలు కొనసాగిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో చంద్రబాబు తరపున న్యాయవాది హరీశ్ సాల్వే వాదనలు వినిపించగా అటు సీఐడీ తరపున ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు.
ఈ నేపథ్యంలో ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.







