మహిళను అపహరించి, అత్యాచారయత్నం చేసిన కేసులో ముగ్గురు భారత సంతతి వ్యక్తులకు యూకే కోర్ట్ జైలు శిక్ష విధించింది.వీరు ముగ్గురు గతేడాది లీసెస్టర్ నగరంలో( Leicester ) గుర్తు తెలియని మహిళను కారులోకి బలవంతంగా ఎక్కించారు.
ఈ కేసులో వీరి నేరం రుజువుకావడంతో వీరు ముగ్గురు ఒక్కొక్కరికి పదేళ్ల జైలు శిక్ష విధించింది న్యాయస్థానం.సెప్టెంబర్‌లో లీసెస్టర్ క్రౌన్ కోర్టులో జరిగిన విచారణ సందర్భంగా అజయ్ దొప్పలపూడి (27),( Ajay Doppalapudi ) వహర్ మంచాల (24),( Vahar Manchala ) రాణా యెల్లంబాయి (30)లను( Rana Yellambai ) ఈ కేసులో దోషులుగా తేలారు.
అనంతరం అక్టోబర్ 6న వీరికి న్యాయస్థానం శిక్షను ఖరారు చేసింది.

గతేడాది జనవరి 16 తెల్లవారుజామున లీసెస్టర్ సిటీ సెంటర్‌లో రాత్రిపూట విహారయాత్రకు వెళ్లిన బాధితురాలిని ఈ ముగ్గురు వ్యక్తులు కలిసి మాట కలిపారు.బాధితురాలు టాక్సీ అని భ్రమపడి వారి ఆడి కారులోకి( Audi Car ) ఎక్కింది.అయితే ఇంటిని దాటి నార్బరో రోడ్ మీదుగా వెళ్లడంతో ఏదో ప్రమాదం జరగబోతోందని ఆమె అనుమానం వ్యక్తం చేసింది.
ఆమె భయపడినట్లుగానే నిందితులు ఆమెను దాదాపు 15 మైళ్ల దూరం తీసుకెళ్లి.లుటర్‌వర్త్‌కు సమీపంలోని ఎం1 నుంచి మిస్టర్టన్‌లోని ఏకాంత ప్రాంతంలో కారును ఆపారు.అనంతరం బాధితురాలిని బలవంతంగా కారులోంచి కిందకు లాగారు.అప్పటికే మహిళ మద్యం మత్తులో వుందని ప్రాసిక్యూషన్ కోర్టుకు తెలియజేసింది.

కాసేపటి తర్వాత బాధితురాలు వారి బారి నుంచి ఎలాగోలా తప్పించుకుని పోలీసులకు సమాచారం అందించింది.నిమిషాల వ్యవధిలోనే అధికారులు అక్కడికి చేరుకుని.ఆమెను సురక్షిత ప్రదేశానికి తీసుకెళ్లారు.దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.సీసీటీవీ ఫుటేజ్ ద్వారా లీసెస్టర్ సిటీ సెంటర్‌లో కారును గుర్తించాయి.కీపర్ లీసెస్టర్ వెస్ట్‌కోట్స్ ప్రాంతంలోని గౌల్ స్ట్రీట్‌లో నిందితులు నివసిస్తున్నట్లు కనుగొని అరెస్ట్ చేశారు.
ఆదివారం తెల్లవారుజామున సిటీ సెంటర్‌లో తమ లైంగిక కోరిక తీర్చుకోవడానికి వీరు ఓ మహిళ కోసం వెతుకుతున్నారని పోలీసులు తెలిపారు.







