తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో అన్ని రాజకీయ పార్టీలు అలర్ట్ అయ్యాయి ఎన్నికల వ్యూహాల్లో మునిగి తేలుతున్నాయి.ప్రజలను ఆకట్టుకునేందుకు పార్టీ మేనిఫెస్టోలను ప్రకటిస్తున్నాయి.
ఇక మూడోసారి హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకోవాలనే పట్టుదలతో ఉన్న బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ ( CM kcr )దానికి తగ్గట్లుగానే ఎన్నికల వరకు అనుసరించాల్సిన వ్యూహాలపైనా, క్షేత్రస్థాయిలో పర్యటనలు చేపట్టేందుకు కెసిఆర్ ప్రణాళికలు సిద్ధ చేస్తున్నారు.ఈనెల 15 నుంచి సభలు, ఇతర కార్యక్రమాలకు శ్రీకారం చుట్టునున్నారు .ఈనెల 15 తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులతో కేసిఆర్ ( CM kcr )ప్రత్యేకంగా సమావేశం కానున్నారు.అనంతరం పార్టీ బీఫారాలు అందజేయనున్నారు.
ఆ తరువాత పార్టీ మేనిఫెస్టోను విడుదల చేస్తారు .ఆ వెంటనే నియోజకవర్గాల పర్యటనకు కేసిఆర్ బయలుదేరి వెళ్తారు.

15న తెలంగాణ భవన్ లో పార్టీ అభ్యర్థులతో జరిగే సమావేశంలోనూ , ఎన్నికల ప్రచార వ్యవహారాలు, సభలు , సమావేశాల నిర్వహణలో పాటించాల్సిన నియమ నిబంధనలు, విపక్షాలను ఏ విధంగా ఎదుర్కోవాలి అనే అనేక అంశాల పైన పార్టీ అభ్యర్థులకు సూచనలు చేయనున్నారు.అదేరోజు సాయంత్రం నాలుగు గంటలకు హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలో జరిగే బహిరంగ సభలో కెసిఆర్ ( CM kcr )పాల్గొంటారు.ఈనెల 15 నుంచి 18 వరకు వరుసగా నాలుగు రోజులపాటు జరిగే బహిరంగ సభల షెడ్యూల్ ను బీఆర్ఎస్ ప్రకటించింది.15 న హుస్నాబాద్ , 16న జనగామ , భువనగిరి , 17న సిద్దిపేట సిరిసిల్ల నియోజకవర్గల్లో నిర్వహించే బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొంటారు.

18 వ తేదీ మధ్యాహ్నం రెండు గంటలకు జడ్చర్లలో, సాయంత్రం నాలుగు గంటలకు మేడ్చల్ లో జరిగే సభలో కేసీఆర్( CM kcr ) ప్రసంగిస్తారు.అలాగే మిగతా నియోజకవర్గాల్లో ప్రచార సభలు, షెడ్యూల్ ను ఖరారు చేయనున్నారు.ఇక కెసిఆర్ నవంబర్ 9న కామారెడ్డి, గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో నామినేషన్ దాఖలు చేస్తారు
.






