టాలీవుడ్ లో సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.ఇందులో భాగంగా ఇవాళ సినీ హీరో నవదీప్ ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యారు.
డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నవదీప్ కు ముగ్గురు నైజీరియన్లతో పరిచయాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.ఈ కేసులో నైజీరియన్లను అరెస్ట్ చేసిన నార్కొటిక్ పోలీసులు నవదీప్ తో ఉన్న సంబంధాలపై ఆరా తీశారు.
ఈ క్రమంలోనే వారితో నవదీప్ కు జరిగిన లావాదేవీలపై ఈడీ ఆరా తీయనుంది.ఇప్పటికే మాదాపూర్ డ్రగ్స్ కేసు వివరాలు ఇవ్వాలని ఈడీ నార్కోటిక్ పోలీసులను కోరిన సంగతి తెలిసిందే.
డ్రగ్స్ విక్రయాల ద్వారా మనీ లాండరింగ్ జరిగిందనే కోణంలో ఈడీ దర్యాప్తు చేయనుంది.







