టాలీవుడ్ ఇండస్ట్రీ అగ్ర నిర్మాతలలో ఒకరు దిల్ రాజు( dil raju ).కాగా నేడు ఆయన తండ్రి శ్యాంసుందర్ రెడ్డి ( Shyamsunder Reddy )(86) తుది శ్వాస విడిచారు.
గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న దిల్ రాజు తండ్రి నేడు కన్నుమూశారు.టాలీవుడ్ ఇండస్ట్రీలో శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ నిర్మాణ సంస్థను స్థాపించి తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు నిర్మించారు.
ఒక తెలుగులో మాత్రమే కాదు ప్రజెంట్ ఇప్పుడు తమిళ సినిమా రంగంలో కూడా సినిమాలు నిర్మిస్తున్నారు.డిస్ట్రిబ్యూటర్ గా కెరియర్ స్టార్ట్ చేసిన దిల్ రాజు నిర్మాతగా తొలి సినిమా “దిల్” చేయడం జరిగింది.
ఆ సినిమా విజయం సాధించటంతో ఆ చిత్రము పేరే.తన పేరుగా మలుచుకున్నారు.
ఆ తర్వాత చాలామంది పెద్ద హీరోలతో సినిమాలు చేసి.అగ్ర నిర్మాతగా ఎదిగారు.
అంతేకాదు ఈ ఏడాది జులైలో తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలికి జరిగిన ఎన్నికలలో తెలుగు ఫిలిం చాంబర్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కూడా ఎన్నిక కావడం జరిగింది.టాలీవుడ్ ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ప్రభాస్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ ఇంకా చాలామంది టాప్ మోస్ట్ హీరోలతో సినిమాలు నిర్మించారు.
ప్రజెంట్ తమిళ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న “గేమ్ చేంజర్” సినిమాని నిర్మిస్తున్నారు.ఈ క్రమంలో దిల్ రాజు తండ్రి మరణించడంతో ఇండస్ట్రీలో చాలామంది ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.







