టాలీవుడ్ ప్రముఖ నటుడు వి.వి.రాజ్ కుమార్( VV Raj Kumar ) ఒక ఇంటర్వ్యూలో మట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.అమ్మగారి ఊరు కర్నూలు జిల్లాలోని నందికొట్కూరు అని నాన్నగారి ఊరు అనంతపురం జిల్లాలోని గుంతకల్( Guntakal ) అని రాజ్ కుమార్ పేర్కొన్నారు.
సినిమా ఇండస్ట్రీకి మా కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదని రాజ్ కుమార్ చెప్పుకొచ్చారు.నాన్నగారు బెస్ట్ యాక్టర్ గా నాటకాలు వేసి సీనియర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా అవార్డులు తీసుకున్నారని రాజ్ కుమార్ అన్నారు.

ఆ విధంగా నాన్న నాటకాల రంగంలో ఉండటం వల్ల నేను యాక్టింగ్ పై ఆసక్తి చూశానేమో అని ఆయన కామెంట్లు చేశారు.2003లో నాన్న టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ గా రిటైర్ కాగా స్పెషల్ ఆఫీసర్ గా చంద్రబాబు ఛాన్స్ ఇచ్చారని ఆయన తెలిపారు.2016లో చనిపోయే వరకు నాన్న జాబ్ చేశారని వి.వి.రాజ్ కుమార్ చెప్పుకొచ్చారు.నేను బెంగళూరులో ( Bangalore )బీటెక్ చేశానని రాజ్ కుమార్ కామెంట్లు చేశారు.

నాన్నగారు కొన్ని సినిమాలలో యాక్ట్ చేశారని రాజ్ కుమార్ పేర్కొన్నారు.నాన్న జాబ్ వల్ల వేర్వేరు ప్లేసెస్ మారానని రాజ్ కుమార్ చెప్పుకొచ్చారు.నాన్న వెంట షూటింగ్ లకు వెళ్లడంతో సినిమాలపై ఆసక్తి పెరిగిందని ఆయన కామెంట్లు చేశారు.కార్తీక్ లా, చిరంజీవిలా ఉనావని అనేవారని ఆయన కామెంట్లు చేయడం గమనార్హం.
హీరోలా ఉన్నావని వచ్చిన కామెంట్ల వల్ల పొంగిపోయానని రాజ్ కుమార్ తెలిపారు.ఆలయ శిఖరం మూవీ షూట్ సమయంలో చిరంజీవి గారిని తొలిసారి చూశానని రాజ్ కుమార్ చెప్పుకొచ్చారు.
చిరంజీవిని చూశాక హీరోలంటే ఇలా మెయింటైన్ చేయాలా అని అనిపించిందని రాజ్ కుమార్ కామెంట్లు చేశారు.రాజ్ కుమార్ ప్రస్తుతం పలు బుల్లితెర ప్రాజెక్ట్ లతో కెరీర్ పరంగా బిజీగా ఉండటం గమనార్హం.







