యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్( Prabhas ) హీరో గా నటిస్తున్న చిత్రాలలో ప్రస్తుతం అభిమానులతో పాటుగా ప్రేక్షకులు కూడా భారీ అంచనాలను పెట్టుకొని ఎదురు చూస్తున్న చిత్రం ‘సలార్’.కేజీఎఫ్ సిరీస్ తర్వాత ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న మాస్ యాక్షన్ చిత్రం కావడం తో టైటిల్ ప్రకటించిన రోజు నుండే ఈ సినిమా పై అంచనాలు కనీవినీ ఎరుగని రేంజ్ లో ఏర్పడ్డాయి.
అందుకు తగ్గట్టుగానే ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్స్ మరియు టీజర్ ఒక రేంజ్ లో పేలాయి.ముఖ్యంగా టీజర్ లోని డైలాగ్స్ యూత్ కి బాగా కనెక్ట్ అయ్యింది.
దీని మీద ఎన్నో మీమ్స్ వచ్చాయి కూడా.డైనోసార్ డైలాగ్ ఎంత ఫేమస్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే.
ఇప్పటి వరకు ఈ టీజర్ కి యూట్యూబ్ లో 136 మిలియన్ కి వ్యూస్ వచ్చాయి.రీసెంట్ గా విడుదలైన ఏ మూవీ టీజర్ కి కానీ, ట్రైలర్ కి కానీ ఈ రేంజ్ లో వ్యూస్ రాలేదు.

అయితే ఈ వ్యూస్ మొత్తం నిజంగా వచ్చాయి అనుకుంటే పెద్ద పొరపాటే.ఈ సినిమాని నిర్మించే హోమబుల్ సంస్థ ఈ టీజర్ కి ప్రత్యేకంగా యాడ్స్ వేయించింది.దాదాపుగా 136 మిలియన్ వ్యూస్ వస్తే అందులో 50 శాతం కి పైగా యాడ్స్ ద్వారా వచ్చినవే అట.ఈ యాడ్స్ కోసం మూవీ టీం దాదాపుగా కోటి రూపాయిల వరకు ఖర్చు చేసిందట.కేవలం సలార్ చిత్రానికి మాత్రమే కాదు, ఈ బ్యానర్ నుండి వచ్చిన గత చిత్రం కేజీఎఫ్ చాప్టర్ 2 ( KGF Chapter 2 )కి కూడా యాడ్స్ వేశారు.సలార్ టీజర్ యాడ్స్ కోసం కోటి రూపాయిలు ఖర్చు చేస్తే, కె జీ ఎఫ్ చాప్టర్ 2 టీజర్ కోసం రెండు కోట్లు ఖర్చు చేసారు.
ఆ టీజర్ కి దాదాపుగా 273 మిలియన్ వ్యూస్ వచ్చాయి.ఇండియా లో ప్రస్తుతం ఇదే ఆల్ టైం టాప్ 1 .

కేవలం యాడ్స్ కోసం వీళ్ళు పెట్టిన బడ్జెట్ చూస్తూ ఉంటే ఒక మీడియం రేంజ్ బడ్జెట్ సినిమా తీసేయొచ్చు అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.ఇక సలార్ చిత్రం విషయానికి వస్తే గత నెల 28 వ తారీఖున విడుదల అవ్వాల్సిన ఈ సినిమా, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కొన్ని రీ షూట్స్ తప్పనిసరి పరిస్థితి లో చెయ్యాల్సి రావడం తో, ఈ చిత్రాన్ని డిసెంబర్ 22 వ తేదికి వాయిదా వేశారు.ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీ లో కొన్ని సన్నివేశాలకు సంబంధించి ప్యాచ్ వర్క్ జరుగుతుంది.







