తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.సీఎం కేసీఆర్ విశ్రాంతి తీసుకోవాల్సిన సమయం వచ్చిందని పేర్కొన్నారు.
రానున్న రోజుల్లో రాష్ట్ర ప్రజలకు విముక్తి లభిస్తుందని రేవంత్ రెడ్డి తెలిపారు.కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలను ప్రకటించిన తరువాత కేసీఆర్ ప్రజాక్షేత్రంలో లేరని చెప్పారు.
ఈ క్రమంలోనే ఇక నుంచి ఫామ్ హౌస్ నుంచి కేసీఆర్ బయటకు రానవసరం లేదన్నారు.కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఆరు గ్యారెంటీల మీదే తొలి సంతకమని తెలిపారు.
అయితే కొందరు ఓట్లు చీల్చే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు.తెలంగాణలో బీజేపీకి ఏముందని ప్రధాని, అమిత్ షా, జేపీ నడ్డా వస్తున్నారన్న రేవంత్ రెడ్డి ప్రజలకు ఎవరేం చేశారో బీఆర్ఎస్ తో చర్చకు తాము సిద్ధమని సవాల్ చేశారు.
ఈ నేపథ్యంలోనే బీజేపీ, బీఆర్ఎస్ కుట్రలను తెలంగాణ ప్రజలు తిప్పికొట్టాలని సూచించారు.







