ఇండియన్ మార్కెట్లో హై రేంజ్ తో ఎలక్ట్రిక్ స్కూటర్లు( Electric scooters ) లాంచ్ అవుతూ చాలామందిని ఆకట్టుకుంటున్నాయి.తాజాగా ప్యూర్ ఈవీ కంపెనీ ఇండియన్ మార్కెట్లో ఈఫ్లూటో 7G మ్యాక్స్ ( ePluto 7G Max ) అనే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసింది.దీని ధర రూ.1,14,999 (ఎక్స్-షోరూమ్)గా కంపెనీ నిర్ణయించింది.ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ పై ఒకసారి ఛార్జ్ చేస్తే 201 కిమీ వరకు ప్రయాణించవచ్చు.స్కూటర్‌లో హిల్-స్టార్ట్ అసిస్ట్, డౌన్‌హిల్ అసిస్ట్, కోస్టింగ్ రీజెనరేషన్, రివర్స్ మోడ్, లాంగ్ బ్యాటరీ లైఫ్ కోసం స్మార్ట్ AI వంటి అనేక ఫీచర్లు ఉన్నాయి.
ఇది నాలుగు రంగులలో లభిస్తుంది: మాట్ బ్లాక్, రెడ్, గ్రే, వైట్.

ఈఫ్లూటో 7G మ్యాక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో 3.5 kWh లిథియం-అయాన్ బ్యాటరీ, 3.21 bhp శక్తిని ఉత్పత్తి చేసే మోటారు అందించారు.బ్యాటరీ AI ద్వారా ఆధారితమైన స్మార్ట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌తో మెరుగైన అందిస్తుంది.ఈ స్కూటర్ 60,000 కిమీ స్టాండర్డ్ వారంటీ, 70,000 కి.మీ ఎక్స్‌టెండెడ్ వారంటీతో వస్తుంది.

ఈఫ్లూటో 7G మ్యాక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఫీచర్ల విషయానికి వస్తే, ఇందులో ఎల్ఈడీ లైట్లు, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్( Digital instrument cluster ) వంటి అడ్వాన్స్డ్ ఫీచర్లు ఉన్నాయి.ఈ ఫీచర్లతో పాటు క్లాసిక్ డిజైన్‌ను కలిగి ఉంది.ఇది రైసింగ్ ఇవ్వకుండానే తనంతట తానుగా 5 కిమీ/గం వేగంతో ముందుకు కదలగలదు, ఇది పార్కింగ్ చేయడానికి లేదా ట్రాఫిక్‌లో నెమ్మదిగా కదలడానికి ఉపయోగపడుతుంది.
ఈ స్కూటర్ రోజుకు 100 కి.మీ.లు ప్రయాణించే వ్యక్తులను లక్ష్యంగా చేసుకుంది, తరచుగా ఛార్జ్ చేయాల్సిన అవసరం లేకుండా సుదీర్ఘ ప్రాంతాలకు వెళ్లడానికి ఇది వీలు కల్పిస్తుంది.







