ఆఫ్ఘనిస్తాన్ భూకంపం: చనిపోతున్నా బిడ్డను కాపాడిన తల్లి.. హార్ట్ బ్రేకింగ్ వీడియో వైరల్...!

ఆఫ్ఘనిస్తాన్‌లో ( Afghanistan ) కుప్పకూలిన భవనం శిథిలాల నుంచి పాపాయిని రక్షించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఘోరమైన భూకంపం( Earthquake ) తరువాత కూడా ఈ చిన్నారి బతకడం చూసి తండ్రి ఎంతో సంతోషించాడు.

 Earthquake In Afghanistan Baby Found Alive Under Rubble In Mother Arms In Herat-TeluguStop.com

శిశువును దుప్పటిలో చుట్టి తన బిడ్డను రక్షించడానికి తన ప్రాణాన్ని త్యాగం చేసింది తల్లి.ఆమె మృతదేహం బిడ్డను గట్టిగా పట్టుకుంది.

ఈ దృశ్యాన్ని చూసి వాలంటీర్లు కంటతడిపెట్టారు.శిథిలాల నుంచి శిశువును మెల్లగా పైకి లేపారు.

వారు బిడ్డకు నీరు, పాలు ఇచ్చారు.

ఆ పాప తండ్రి భూకంపం నుంచి ప్రాణాలతో బయటపడ్డాడు.

కానీ భార్య, మరో ఇద్దరు పిల్లలను కోల్పోయాడు.పాప తండ్రి తన చిట్టి కూతురు సజీవంగా ఉండడంతో ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

ఆమెను ఆలింగనం చేసుకుని రక్షించినందుకు రక్షకులకు కృతజ్ఞతలు తెలిపాడు.అతను ఆమెకు నార్గేస్ అని పేరు పెట్టాడు, దీనికి పెర్షియన్ భాషలో “పువ్వు” అని అర్థం.

శిశువును రక్షించిన వీడియో ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతోంది, చాలా మంది దీనిని ఒక అద్భుతం, ఆశకు చిహ్నంగా పేర్కొన్నారు.మరికొందరు తల్లి ధైర్యాన్ని, కూతురి పట్ల చూపిన ప్రేమను కూడా కొనియాడారు.మరికొందరు భూకంప బాధితులకు తమ సంతాపాన్ని, సంఘీభావాన్ని వ్యక్తం చేశారు.మరింత మానవతా సహాయం, మద్దతు కోసం కోరారు.

ఆదివారం ఉదయం సంభవించిన భూకంపం చాలామందిని పొట్టన పెట్టుకుంది.రిక్టార్ స్కేల్ పై తీవ్రత 6.3గా నమోదైంది.ఈ ఎర్త్ క్వేక్ ఇరాన్( Iran ) సరిహద్దులో కేంద్రీకృతమై ఉంది.

ఇది అనేక ప్రావిన్సులలో విస్తృతమైన నష్టం, విధ్వంసం కలిగించింది, ప్రత్యేకించి హెరాత్‌లో ( Herat Province ) ఎక్కువ మంది ప్రాణనష్టం సంభవించింది.

దేశంలోని చాలా భాగాన్ని నియంత్రించే తాలిబాన్ ప్రకారం, భూకంపం కారణంగా 2,000 మందికి పైగా మరణించారు, వేలాది మంది గాయపడ్డారు.

చాలా మంది ఇప్పటికీ తప్పిపోయారు లేదా శిథిలాల కింద చిక్కుకుపోయారు.ఒక ఘటలో అత్యంత దెబ్బతిన్న ఒక ప్రాంతంలో వాలంటీర్ల బృందం నాలుగు అంతస్తుల భవనం శిథిలాల మధ్య చిక్కుకుంది.

వారందరూ ప్రాణాలతో బయటపడ్డారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube