టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ బ్యూటీ అంటే ప్రస్తుతం అందరి నోళ్ల నుండి యంగ్ హీరోయిన్ శ్రీలీల ( Sreeleela ) పేరు మాత్రమే వస్తుంది.ఈమె తన అంద చెందాలతో మొదటి రెండు సినిమాలతోనే ఎంతో మంది స్టార్ దర్శకులతో పాటు హీరోలను కూడా పడగొట్టింది అని చెప్పుకోవచ్చు.
ఇక ఈ హీరోయిన్ ఉంటే కచ్చితంగా సినిమా హిట్ అనేలా ఇండస్ట్రీలో మారిపోయింది.అంతేకాదు సెలబ్రిటీల జాతకాలు చెబుతూ ఫేమస్ అయిన వేణు స్వామి ( Venu Swamy ) సైతం శ్రీలీల జాతకం చాలా అద్భుతంగా ఉందని ఆమెకు రాజయోగం పడుతుంది అంటూ చెప్పుకొచ్చారు.
ఇక ఇప్పటికే ఒకేసారి 10,12 సినిమాల్లో హీరోయిన్ గా చేస్తానని శ్రీ లీల సైన్ చేసి అడ్వాన్స్ కూడా తీసుకున్నట్టు టాలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది.

ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్, భగవంత్ కేసరి( Bhagavanth kesari ), గుంటూరు కారం, ఆది కేశవ, ఎక్స్ట్రా ఆర్డినరీ వంటి సినిమాల్లో నటిస్తోంది.ఇవే కాకుండా విజయ్ దేవరకొండ తో కలిసి కూడా ఓ సినిమాలో చేస్తోంది.అయితే తాజాగా శ్రీలీల గురించి టాలీవుడ్ లో ఒక టాక్ వినిపిస్తోంది.
అదేంటంటే టాలీవుడ్ లో ఉండే ఓ స్టార్ హీరో శ్రీలీలపై ఉండే ప్రేమతో రెండు కోట్లు గిఫ్ట్ గా ఇచ్చారట.ఇక అసలు విషయం ఏమిటంటే.ప్రస్తుతం శ్రీలీల రెండు కోట్ల రెమ్యూనరేషన్ ఓ సినిమా కోసం తీసుకుందట.
కానీ ఆ సినిమాలో తన పాత్ర ఎక్కువ ఉండడంతో దర్శకనిర్మాతల దగ్గరికి వెళ్లి నాకు ఈ సినిమా కోసం ఇంకో రెండు కోట్లు ఎక్కువ కావాలి అని డిమాండ్ చేసిందట.
కానీ అప్పటికే బడ్జెట్ వేసి పెట్టుకున్న మూవీ మేకర్స్ శ్రీలీల ( Sreeleela Remuneration ) రెండు కోట్లు ఇవ్వడం వల్ల వారికి ఎక్స్ట్రా ఖర్చవుతుంది అని కావాలంటే సినిమా నుండి తప్పుకుంటే వేరే హీరోయిన్ ని తీసుకుంటామని చెప్పారట.

అయితే ఈ విషయం తెలిసిన ఆ సినిమా హీరో అలాంటిదేమీ వద్దు నా సినిమాలో శ్రీలీలనే హీరోయిన్ గా కావాలని, నాకు ఇచ్చే రెమ్యూనరేషన్ నుండి ఆ రెండు కోట్లు తీసుకొని శ్రీలీలకు ఇవ్వండి అంటూ దర్శక నిర్మాతలకి చెప్పారట.ఇక హీరో అలా మాట్లాడడంతో దర్శక నిర్మాతలు ఇద్దరు షాక్ అయ్యారట.అంతేకాదు సెట్ లో వీరి గురించి కొన్ని గుసగుసలు కూడా పెట్టుకుంటున్నారట.
ఈ హీరోకి శ్రీలీల అంటే అంత ఇష్టం ఎందుకో అని ప్రశ్నలు వేసుకుంటూ ఈ విషయాన్ని నెట్టింట వైరల్ గా మార్చారు.