హైదరాబాద్ లోని మేడ్చల్ పరిధిలో విషాద ఘటన చోటు చేసుకుంది.గాజులరామారం సర్కిల్ సూరారంలో భవనంపై నుంచి పడి కార్మికుడు అక్కడికక్కడే మృత్యువాతపడ్డాడు.
కార్మికుడు మృతితో కుటుంబ సభ్యులు ఆందోళన కార్యక్రమం చేపట్టారు.అనుమతులు లేకుండా భవనాన్ని నిర్మిస్తున్నారని ఆరోపించారు.
యాజమాన్యం కనీస జాగ్రత్తలు తీసుకోకుండా నిర్మాణం చేపట్టడం వలనే ప్రమాదం జరిగిందని మండిపడుతున్నారు.ఈ క్రమంలో మృతిచెందిన కార్మికుని కుటుంబానికి న్యాయం చేయాలని తోటి కార్మికులు నిరసన కార్యక్రమం చేపట్టారు.







