సూపర్ స్టార్ మహేష్ బాబు( Mahesh Babu )లేటెస్ట్ గా నటిస్తున్న భారీ మాస్ యాక్షన్ మూవీ ‘‘గుంటూరు కారం’‘( Guntur Kaaram ).మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కొద్దీ రోజుల వాయిదా తర్వాత మళ్ళీ ఇటీవలే షూట్ స్టార్ట్ అయ్యి శరవేగంగా పూర్తి అవుతుంది.
వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేస్తామని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
దీంతో అనుకున్న సమయానికి రిలీజ్ చేసేందుకు మేకర్స్ ఎక్కడ తగ్గకుండా షూట్ ముగిస్తున్నారు.మహేష్ మంచి పవర్ఫుల్ రోల్ లో కనిపిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు.త్రివిక్రమ్,( Trivikram ) మహేష్ కాంబో దాదాపు పుష్కర కాలం తర్వాత సెట్ అవ్వడంతో ఈ సినిమా కోసం ప్రతీ ఒక్కరు చాలా కష్ట పడుతున్నారు.
ఇప్పటికే ఇది పాన్ ఇండియన్ కాకపోయినా భారీ బిజినెస్ చేసుకుని రీజనల్ సినిమాల్లోనే రికార్డులను క్రియేట్ చేసుకుంటూ పోతుంది.దీంతో ఈ సినిమా తప్పకుండ సక్సెస్ ఫుల్ చేసేందుకు త్రివిక్రమ్, మహేష్, థమన్ బాగా కష్టపడుతున్నారని నిర్మాత నాగవంశీ కూడా తెలిపారు.
గతంలో త్రివిక్రమ్, మహేష్ కాంబో రెండుసార్లు రాగా రెండవ సారి ఖలేజా సినిమాతో వచ్చింది.
ఈ సినిమా ఆడియెన్స్ ఎక్స్పెక్టేషన్స్ కు రీచ్ కాలేక పోయింది.కల్ట్ క్లాసిక్ గా నిలిచినా కమర్షియల్ గా వర్కౌట్ అవ్వలేదు.ఆలాగే సర్కారు వారి పాట సినిమాకు థమన్ పూర్తి న్యాయం చేయలేదని ఫ్యాన్స్ భావన.
దీంతో త్రివిక్రమ్, థమన్( Thaman ) ఇద్దరికీ కూడా గుంటూరు కారం మూవీ పెద్ద పరీక్ష అనే చెబుతున్నారు.మరి రానున్న సంక్రాంతి వారిలో ఈ మూవీ ఏ రేంజ్ లో హిట్ అవుతుందో చూడాలి.