టాలీవుడ్( Tollywood ) స్టార్ హీరోలలో ఒకరైన రామ్ గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.రామ్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కిన స్కంద మూవీ వినాయక చవితి కానుకగా థియేటర్లలో విడుదల కావాల్సి ఉన్నా సలార్ రిలీజ్ డేట్ మారడంతో ఆలస్యంగా థియేటర్లలో విడుదలైంది.
గత నెల 28వ తేదీన థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు ఆశించిన రేంజ్ లో కలెక్షన్లు రాలేదు.
మరోవైపు స్కంద( Skanda ) మూవీలో రామ్ డ్యూయల్ రోల్ లో నటించిన సంగతి తెలిసిందే.
ఈ సినిమాలో రామ్ డ్యూయల్ రోల్ లో నటించడానికి కారణమేంటనే ప్రశ్న బోయపాటి శ్రీనుకు( Boyapati Srinu ) ఎదురుకావడంతో పాటు స్కందలో సెకండ్ రోల్ లో కూడా రామ్ నే తీసుకోవడానికి గల కారణమేంటనే ప్రశ్న ఎదురైంది.ఈ ప్రశ్న గురించి బోయపాటి శ్రీను స్పందిస్తూ మరో రామ్ స్థానంలో స్టార్ హీరోలలో ఎవరినైనా తీసుకోవచ్చని అన్నారు.

స్కంద సినిమాలో మరో రామ్ కనిపించే ఫైట్ సీన్ భారీ లెవెల్ లో ఉంటుందని ట్రాక్టర్ గాలిలోకి లేస్తుందని అంత హై సీన్ లో మరో హీరోను పెడితే ఫస్ట్ నుంచి చేసిన రామ్ ఏమైపోవాలని బోయపాటి శ్రీను ప్రశ్నించారు.అలా చేసి ఉంటే రామ్ భుజాలపై ఉన్న సినిమా మరో హీరో చేతిలోకి వెళ్లిపోతుందని ఆయన కామెంట్లు చేశారు.గెస్ట్ రోల్ ఎవరైనా చేసినా భారీగానే తీయాల్సి ఉంటుందని బోయపాటి శ్రీను అన్నారు.

బన్నీ లేదా బాలయ్య మరో రోల్ లో కనిపిస్తే అప్పటివరకు చేసిన రామ్ ను ప్రేక్షకులు మరిచిపోతారని బోయపాటి శ్రీను కామెంట్లు చేశారు.సినిమా బాగుంటుందని గెస్ట్ హీరోకు కూడా బాగుంటుందని మరో హీరో నటిస్తే రామ్ పరిస్థితేంటని ఆయన తెలిపారు.అందుకే మరో హీరోను పెట్టకుండా రామ్ నే మరో గెటప్ లో చూపించానని బోయపాటి శ్రీను కామెంట్లు చేశారు.
బోయపాటి శ్రీను వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.







