హైదరాబాద్ లో ఇవాళ సీపీఎం నేతల కీలక భేటీ జరగనుంది.పార్టీ కార్యాలయం ఎంబీ భవన్ లో సీపీఎం స్టేట్ కమిటీ సమావేశం ఏర్పాటు కానుంది.
ఇందులో ప్రధానంగా పొత్తులతో పాటు సీట్ల కేటాయింపుపై నేతలు చర్చించనున్నారు.అదేవిధంగా పోటీ చేసే స్థానాలు, అభ్యర్థుల ఎంపికతో పాటు కాంగ్రెస్ పార్టీ సహకారంపై చర్చలు జరపనున్నారు.
అయితే ఎమ్మెల్యే సీటుతో పాటు ఎమ్మెల్సీ కూడా ఇచ్చేందుకు కాంగ్రెస్ సముఖతగా ఉన్న నేపథ్యంలో లెఫ్ట్ పార్టీలు పొత్తుల అంశంపై సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది.తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో లెఫ్ట్ పార్టీల ప్రభావం ఎక్కువగా ఉన్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే పాలేరు నియోజకవర్గం నుంచి తమ్మినేని పోటీ చేయాలని యోచనలో ఉన్నారని తెలుస్తోంది.







