టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం( Kiran Abbavaram ) , నటి నేహా శెట్టి ( Neha Shetty ) హీరో హీరోయిన్లుగా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి చిత్రం రూల్స్ రంజన్( Rules Ranjan ) .ఈ సినిమా విడుదలకు ముందు సినిమా నుంచి విడుదల చేసినటువంటి ట్రైలర్ టీజర్ పాటలు సినిమాపై భారీ స్థాయిలో అంచనాలను పెంచేశాయి.
ఈ సినిమా అక్టోబర్ ఆరవ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.అయితే ప్రేక్షకుల అంచనాలను చేరుకోవడంలో ఈ సినిమా విఫలమైందనే చెప్పాలి.
ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి మిశ్రమ స్పందన దక్కించుకుంది.

ఇక ఈ సినిమాలోని సమ్మోహనుడా అనే పాట భారీగా ట్రెండ్ అయిన విషయం మనకు తెలిసిందే.ఇలా ఈ పాట ద్వారా సినిమాపై కూడా భారీగానే అంచనాలు ఏర్పడినప్పటికీ కలెక్షన్ల పరంగా ఈ సినిమా సక్సెస్ అందుకోలేకపోయింది.ఇక ఈ సినిమాకు ప్రముఖ నిర్మాత ఏఏం రత్నం కుమారుడు జ్యోతి కృష్ణ( Jyothi Krishna ) దర్శకత్వం వహించారు.
అయితే ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఈయన ఈ సినిమా గురించి మాట్లాడుతూ ఈ సినిమా కథ మొత్తం సిద్ధం చేసుకున్న తర్వాత ముందుగా కిరణ్ అబ్బవరాన్ని కాకుండా నవీన్ పోలిశెట్టి ( Naveen Polishetty ) ని సంప్రదించారట అయితే ఈయన కథ రాసుకున్న సమయంలోనే నవీన్ పోలిశెట్టి ని దృష్టిలో పెట్టుకొని ఈ సినిమా కథ సిద్ధం చేశారట.

ఇక కథ మొత్తం సిద్ధమైన తర్వాత హీరో నవీన్ పోలిశెట్టిని కలిసి ఈ సినిమా గురించి చెప్పడంతో ఆయన అప్పటికే మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాకు కమిట్ అయి షూటింగ్ పనులలో బిజీగా ఉండగా ఈ సినిమాని చేయడం కుదరని పక్షంలో రిజెక్ట్ చేశారు.దీంతో నవీన్ పోలిశెట్టి స్థానంలో కిరణ్ అబ్బవరం ఈ సినిమాలో నటించే అవకాశాన్ని అందుకున్నారని తెలుస్తుంది.విడుదలకు ముందు పాటలు, ట్రైలర్ తో ఎక్కువగా క్యూరియాసిటిని కలిగించిన ఈ సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద అంతగా ఆకట్టుకోలేకపోయింది.
.






