రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బాకూరుపల్లి తండా గ్రామంలో బతుకమ్మ చీరలను, గృహలక్ష్మి పట్టాలను పంపిణీ చేశారు.ఎల్లారెడ్డిపేట మండలం బాకూరు పల్లి తండా గ్రామంలో శనివారం స్థానిక గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ అజ్మీర మంజుల రాజు నాయక్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి ముఖ్య అతిథిగా ఎంపీపీ పిల్లి రేణుక,జెడ్ పి టి సి చీటీ లక్ష్మణ్ రావు లు పాల్గొని బతుకమ్మ చీరలను అదేవిధంగా గృహలక్ష్మి పట్టాలను మహిళలకు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్న ప్రభుత్వంను రానున్న శాసనసభ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి హైట్రిక్ ముఖ్యమంత్రిగా కేసీఆర్ ను ఎన్నుకోవాలని సూచించారు.కులాలకు, మతాలకు అతీతంగా పండుగల సందర్భంలో ఆడపడుచులకు చీరలను కట్నంగా ఇస్తుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో సింగిల్ విండో అధ్యక్షులు కృష్ణారెడ్డి, సీనియర్ జిల్లా నాయకులు అందే సుభాష్, పట్టణ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి, వార్డు సభ్యులు తిరుపతి, నందరాజు,భాస్కర్, నాయకులు పుణ్యానాయక్, నరేష్, మురళి, రమేష్, రాములు, రాజు తదితరులు పాల్గొన్నారు.