చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్ స్కాం లో అరెస్టు కావడంతో ఎంతోమంది ఈయన అరెస్టును వ్యతిరేకించారు.ఇక చంద్రబాబు నాయుడు ( Chandra babu Naidu ) అరెస్టు కావడంతో నిరసనలు కూడా తెలియజేశారు.
అయితే చిత్ర పరిశ్రమ నుంచి మాత్రం అనుకున్న స్థాయిలో చంద్రబాబు నాయుడుకు మద్దతు లభించలేదని చెప్పాలి.ఏ కొంతమంది మాత్రమే అది ఒకసారి చంద్రబాబు నాయుడు అరెస్టు గురించి మాట్లాడి వదిలేశారు.
అయితే చంద్రబాబు నాయుడు అరెస్టుకు చిత్ర పరిశ్రమ నుంచి మద్దతు రాకపోవడం గురించి తాజాగా జనసేన అధినేత సినీ నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) స్పందించారు.
మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొన్నటువంటి జనసేన ( Janasena ) అధినేత పవన్ కళ్యాణ్ ఈ విషయం గురించి మాట్లాడుతూ సినిమా ఇండస్ట్రీ( Film Industry ) చంద్రబాబు నాయుడు అరెస్టుకు మద్దతు తెలుపకపోవటానికి ఎన్నో కారణాలు ఉంటాయి .చిత్ర పరిశ్రమకు రాజకీయాలకు ఏమాత్రం సంబంధం ఉండదని తెలిపారు.చిత్ర పరిశ్రమకు సంబంధించిన వారు రాజకీయాల గురించి మాట్లాడితే వారికి ఎన్నో సమస్యలు వస్తాయి.
ఒక సినీ నటుడిగా నాకు ఆ విషయం తెలుసు అని ఈయన తెలిపారు.ఇప్పుడే కాదు గతంలో కూడా రాజకీయాల గురించి ఇండస్ట్రీలో కొన్ని వర్గాలు ఉంటాయనీ తెలిపారు.
ఇప్పుడే కాదు గతంలో మేము ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు కూడా ఇలాగే ఉందని ఈయన తెలిపారు.
ఇక ప్రస్తుతం అయితే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు సపోర్ట్ చేస్తే వారిపై ఎక్కడ లేని వాదనలు వస్తాయోనని భయపడుతున్నారు.అందుకే సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కూడా మౌనంగా ఉన్నారని పవన్ కళ్యాణ్ తెలిపారు.కొద్దిరోజుల క్రితం ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు సందర్భంగా సూపర్ స్టార్ రజనీకాంత్ ( Rajinikanth ) చంద్రబాబు గురించి మాట్లాడితే ఆయన గురించి వైసిపి నేతలు తిట్టని తిట్టలేదు.
అలాంటి ఒక స్టార్ హీరో పట్ల వైసిపీ నేతలు చాలా దారుణంగా మాట్లాడారు.ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరు కూడా స్పందించడం లేదని ఈయన తెలియజేశారు.
నాలాంటి మొండి వాళ్లు మాత్రమే బయటకు రాగలరు ఇక నేను కూడా రాజకీయాలలో( Politics ) ఉన్నాను కాబట్టి మాట్లాడుతున్నాను అదే సినిమా ఇండస్ట్రీకే పరిమితం అయి ఉంటే ఎంతవరకు మాట్లాడగలిగే వాడిన నాకు కూడా తెలియదు అంటూ పవన్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.