పోషకాల కొరత, రెగ్యులర్ గా తల స్నానం చేయడం, వేడి వేడి నీటితో హెయిర్ వాష్ చేయడం, రసాయనాలు అధికంగా ఉండే షాంపూ ను వినియోగించడం, హెయిర్ స్టైలింగ్ టూల్స్ ను ఓవర్ గా యూస్ చేయడం.తదితర కారణాల వల్ల కొందరి జుట్టు తరచూ డ్రైగా( Dry hair ) మారుతుంది.
అలాగే జుట్టు ఎక్కువగా చిట్లిపోతూ ఉంటుంది.దీంతో ఏం చేయాలో తెలీక తెగ సతమతం అయిపోతుంటారు.
కానీ వర్రీ వద్దు ఇంట్లోనే డ్రైగా మారి చిట్లిపోయిన జుట్టును రిపేర్ చేసుకోవచ్చు.
అందుకు ఇప్పుడు చెప్పబోయే రెమెడీ చాలా ఉత్తమం గా సహాయపడుతుంది.మరి లేటెందుకు ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో మూడు నుంచి నాలుగు ఫ్రెష్ మందారం పువ్వులను ( Hibiscus )వేసుకోండి.
అలాగే రెండు టేబుల్ స్పూన్లు ఉసిరికాయ పొడి, అర కప్పు కొబ్బరి పాలు వేసుకుని స్మూత్ పేస్ట్ లా గ్రైండ్ చేసుకోండి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో ఒక ఎగ్ వైట్,( Egg white ) రెండు టేబుల్ స్పూన్లు ఆముదం ( Castor Oil )వేసుకుని బాగా మిక్స్ చేయండి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.గంట లేదా గంటన్నర అనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.వారానికి రెండు సార్లు ఈ రెమెడీని పాటిస్తే డ్రై హెయిర్ అన్న మాటే అనరు.ఈ హెయిర్ ప్యాక్ డీప్ కండిషనర్ గా పనిచేస్తుంది.మీ జుట్టును తేమగా కోమలంగా మారుస్తుంది.అలాగే ఈ రెమెడీని వారానికి రెండు సార్లు పాటిస్తే కనుక చిట్లిన జుట్టు రిపేర్ అవుతుంది.
మళ్లీ మీ హెయిర్ హెల్తీగా మరియు సిల్కీగా మారుతుంది.హెయిర్ ఫాల్ సమస్యతో బాధపడుతున్న వారు కూడా ఈ రెమెడీని పాటించవచ్చు.
జుట్టు కుదుళ్లను బలోపేతం చేసి హెయిర్ ఫాల్ కు అడ్డుకట్ట వేయడానికి ఈ హోమ్ రెమెడీ అద్భుతంగా సహాయపడుతుంది.