ఈ స్టాక్‌లో పెట్టుబడి పెడితే 45 శాతానికి పైగా రిటర్న్స్ మీ సొంతం...!

అత్యధిక రిటర్న్స్ పొందడానికి స్టాక్ మార్కెట్ కంటే మించిన మరొక మార్గం లేదు.అయితే తాజాగా ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ పెట్టుబడిదారులకు కొన్ని విలువైన రికమండేషన్ చేసింది.నవిన్ ఫ్లోరిన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్( NAVIN FLORIN INTERNATIONAL LIMITED ) (ఎన్‌ఎఫ్‌ఐఎల్) షేర్లను ఒక్కొక్కటి రూ.5,368 టార్గెట్ ధరతో కొనుగోలు చేయాలని తాజాగా సూచించింది.అంటే మీరు ప్రస్తుత మార్కెట్ ధరలో స్టాక్‌ను కొనుగోలు చేస్తే, గరిష్టంగా 45% వరకు రాబడిని పొందవచ్చు.

 If You Invest In This Stock, You Will Get More Than 45 Percent Returns, Nfil Sto-TeluguStop.com

హెచ్‌పీపీ, స్పెషాలిటీ కెమికల్స్, సీడీఎంఓ( HPP, Specialty Chemicals, CDMO ) అనే మూడు వ్యాపార విభాగాలలో వృద్ధి అవకాశాల బాగా కనిపిస్తున్నాయి.వీటినుంచి కంపెనీ ప్రయోజనం పొందుతూ మంచి పొజిషన్‌లో ఉంటుందని భావించినందున ఎన్‌ఎఫ్‌ఐఎల్‌ షేర్ బుల్లిష్‌గా ఉంటుందని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ అంచనా వేస్తోంది.NFIL రూ.18,430.85 కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్‌తో మిడ్‌క్యాప్ కెమికల్స్ రంగ కంపెనీగా నిలుస్తోంది.NFIL లాభాలు రాబోయే నాలుగు సంవత్సరాలలో ప్రతి సంవత్సరం 30% పెరుగుతాయని, వడ్డీ, పన్నులు, తరుగుదల, రుణ విమోచనకు ముందు దాని ఆదాయాలు ప్రతి సంవత్సరం 33% పెరుగుతాయని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ ఆశిస్తోంది.

ఎన్‌ఎఫ్‌ఐఎల్ షేర్లు ప్రస్తుతం ఒక్కొక్కటి రూ.3,716 వద్ద ట్రేడవుతున్నాయి, ఇది వాటి మునుపటి క్లోజింగ్ ప్రైస్‌తో పోలిస్తే 0.55% పెరిగింది.స్టాక్ 1 వారంలో 1.29%, 1 నెలలో 20.70%, 6 నెలల్లో 12.69% పడిపోయింది.అయితే, ఇది 3 సంవత్సరాలలో 79.65% పాజిటివ్ రిటర్న్స్, 5 సంవత్సరాలలో 479.68% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది.పాఠకులు ఇది ఆర్థిక సలహా కాదని గమనించాలి.

ఏదైనా పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు దయచేసి మీ సొంతంగా పరిశోధన చేయడం మంచిది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube