తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని జనసేన( Janasena ) తీసుకున్న నిర్ణయం వ్యూహాత్మకం గా సరైనదా కాదా అంటూ అనేక విశ్లేషణలు బయలుదేరాయి .బలం ఉన్న ఆంధ్రప్రదేశ్లో పోటీ కి సమాయతమవ్వకుండా కనీస ప్రిపరేషన్ కూడా లేని తెలంగాణ ఎన్నికల్లో వేలుపెట్టడం అంత సరైన నిర్ణయం కాదని మెజారిటీ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతుండగా, కొంత మంది మాత్రం దీర్ఘకాల భవిష్యత్తు వ్యూహంతోనే పవన్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని అసలు రెండు సంవత్సరాల క్రితమే జిహెచ్ఎంసి ఎన్నికలలో( GHMC elections ) జనసేన పోటీ పడడానికి సిద్ధమైందన్న విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు.
ముఖ్యంగా ఆంధ్రమూలాలు కలిగిన ప్రాంతాలలోనే జనసేనను పోటీకి నిలబెట్టడం ద్వారా తమ ప్రభావం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఉందన్న నిరూపించడంతోపాటు తెలుగుదేశం జనసేన పొత్తు ప్రభావం ఈ సీట్లలో పడిందా లేదా అన్న టెస్టింగ్ కోసం కూడా జనసేన ఒక ట్రైల్ వేస్తున్నట్లు అవుతుందని కొంతమంది అభిప్రాయపడుతున్నారు.

అంతేకాకుండా తెలంగాణలో పొత్తులపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు అన్న పవన్ ప్రకటన జనసేన తెలుగుదేశం పొత్తును తెలంగాణలో కూడా కొనసాగిస్తారన్న కొత్త అంచనాలకు అవకాశం ఇచ్చింది.అయితే తెలుగుదేశం తరపున ఏ నిర్ణయం అయినా తీసుకోవాల్సిన చంద్రబాబు( Chandrababu ) రాజకీయం చదరంగంలో బందీ అయిపోవడం తో ఇప్పటికిప్పుడు పొత్తులపై నిర్ణయం తీసుకోవడం కష్టమే కావచ్చు.అయితే ఇప్పటివరకు పోటీకి వెనకాడుతున్నారని విమర్శలను మూట కొట్టుకున్న జనసేన ఇప్పుడు తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధమైనట్టుగా తెలుస్తుంది అయితే ఒకవేల తెలంగాణ ఎన్నికల్లో సరైన ఫలితాలు రాకపోతే మాత్రం ఇది వచ్చే ఎన్నికలలో జనసేనకు మానసికంగా నిరుత్సాహం కలిగించడం తో పాటు ఎలాగూ గెలవరన్న ఆలోచనతో తటస్థులు కూడా దూరమయ్యే అవకాశం ఉందని కొంత మంది అంచనా వేస్తున్నారు .ఏది ఏమైనా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేయాలని జనసేన పార్టీ నిర్ణయం తీసుకున్న నిర్ణయమే అనూహ్య నిర్ణయమే తప్ప ముందస్తు వ్యూహం ఉన్నట్లుగా కనిపించడం లేదన్నది మెజారిటీ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం







