ఒకాయ కంపెనీ( Okaya Company ) ఇప్పటికే కొన్ని ఎలక్ట్రిక్ స్కూటర్లు లాంచ్ చేసి ఆకట్టుకుంది.తాజాగా మోటోఫాస్ట్ అనే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఒకాయ ఆవిష్కరించింది.
త్వరలోనే లాంచ్ కానన్న దీనిని మీరు ఇప్పుడు విక్రయానికి ముందే దీనిని ప్రీ-ఆర్డర్ చేయవచ్చు.ఈ స్టైలిష్ ఎలక్ట్రిక్ స్కూటర్ చాలా వేగంగా కూడా దూసుకెళ్తుంది.
ఒకాయ ఈవీ మోటోఫాస్ట్( Okaya EV Motofast ) భారతదేశంలో త్వరలో విడుదల కానున్న కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.దీని గరిష్ట వేగం గంటకు 70 కి.మీ, ఒక్కసారి ఛార్జ్ చేస్తే 120 కి.మీ రేంజ్ ఆఫర్ చేస్తుంది.సిటీల్లో ప్రయాణాలు చేయడానికి ఇది అనువుగా ఉంటుంది.స్కూటర్ ధర రూ.1.50 లక్షల ఎక్స్-షోరూమ్ కంటే తక్కువగా ఉండొచ్చని అని అంచనా.

ఒకాయ ఈవీ మోటోఫాస్ట్ స్కూటర్ సియాన్( Okaya EV Motofast Scooter Scion ), బ్లాక్, గ్రీన్, రెడ్, గ్రే వంటి 5 రంగులలో అందుబాటులో ఉంటుంది.ఎలక్ట్రిక్ మోటార్ పవర్ అవుట్‌పుట్ ఇంకా వెల్లడి కాలేదు, అయితే ఇది హబ్-మౌంటెడ్ యూనిట్.ఈ స్కూటర్ అల్లాయ్ వీల్స్, ట్యూబ్ లెస్ టైర్లతో రానుంది.ఇందులోనే బ్యాటరీ ఓవర్ హీటింగ్ వంటి సమస్యలతో రాదు.ఒకాయ ఈవీ మోటోఫాస్ట్ స్పీడ్, ఓడోమీటర్, ట్రిప్ మీటర్, రైడింగ్ మోడ్, సమయం, బ్యాటరీ శాతాన్ని చూపే 7-అంగుళాల టచ్‌స్క్రీన్ డిస్‌ప్లేను కలిగి ఉంది.ఇది ఎల్ఈడీ హెడ్‌లైట్లు, టర్న్ ఇండికేటర్లు, రెండు చక్రాలకు డిస్క్ బ్రేక్‌లు, ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్కులు, వెనుక షాక్ అబ్జార్బర్‌లను అందిస్తుంది.
ఫెస్టివల్ సీజన్ లో ఒక మంచి ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకొచ్చి సేల్స్ పెంచుకోవాలని కంపెనీ భావిస్తోంది.







