తెలుగులో తీర్పు వెలువరించి ఏపీ హైకోర్టు కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టింది.రెండు సివిల్ కేసుల్లో న్యాయమూర్తి మన్మధ రావు తీర్పును తెలుగులో చదివి వినిపించారు.
స్థానిక భాషల్లో తీర్పును ఇవ్వొచ్చని ఇటీవల భారత అత్యున్నత న్యాయస్థానం వెల్లడించిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే తీర్పును తెలుగులో వినిపించారు న్యాయమూర్తి.
ఇక నుంచి ఆర్డర్ కాపీలను సైతం హైకోర్టు తెలుగులో ముద్రించి ఇవ్వనుందని తెలుస్తోంది.సుప్రీం వ్యాఖ్యల నేపథ్యంలో హైకోర్టులు కూడా స్థానిక భాషలో తీర్పు వెలువరించడానికి ఆసక్తి చూపుతున్నాయని తెలుస్తోంది.







