ఉమ్మడి చిత్తూరు జిల్లా అంగళ్లులో జరిగిన దాడి ఘటనలో టీడీపీ నేతలకు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది.ఈ మేరకు నాయకులకు ధర్మాసనం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
మాజీ మంత్రి అమర్ నాథ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రాంప్రసాద్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ దమ్మాలపాటి రమేశ్ తో పాటు మరి కొందరికి బెయిల్ వచ్చింది.అయితే అంగళ్లు ఘటనలో తెలుగుదేశం పార్టీ నేతలపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే.
ఈ కేసులో విచారణ జరిపిన హైకోర్టు నేతలకు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.







