ఏం మాట్లాడుతున్నాడో పవన్‎కే తెలియాలి..: కొడాలి నాని

ప్రతిపక్ష నేతలు చంద్రబాబు, పవన్ కల్యాణ్ లపై మాజీ మంత్రి కొడాలి నాని సెటైర్లు వేశారు.చంద్రబాబు కోటలో ఉన్నా, పేటలో ఉన్నా ఒకటేనని తెలిపారు.

 Pawan Should Know What He Is Talking About..: Kodali Nani-TeluguStop.com

పవన్ తమ పార్టీని రూపాయి పావలా అంటున్నారన్న కొడాలి నాని అంటే తమకు 125 సీట్లు వస్తాయని అర్థమని చెప్పారు.పావలా కల్యాణ్ ఉమ్మడి కూటమికి 25 సీట్లు వస్తాయని అర్థమని పేర్కొన్నారు.

ఎప్పుడు ఎవరితో ఉంటారో ఎవరితో విడిపోతారో పవన్ కే తెలియదని ఎద్దేవా చేశారు.పోటీ చేసిన రెండుచోట్ల ఓడిపోయిన పవనే ఇంతలా గెంతులేస్తుంటే 150 మంది ఉన్న తాము ఏం చేయాలని ప్రశ్నించారు.

ఓ వైపు టీడీపీతో కలవమని బీజేపీ చెబుతుండగా పవన్ మాత్రం ఎన్డీఏలో ఉన్నానంటున్నాడన్న కొడాలి నాని ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే తెలియాలని విమర్శించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube