మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్ లో బీజేపీ స్టేట్ కౌన్సిల్ సమావేశం జరిగింది.దీనికి హాజరైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలంగాణ సీఎం కేసీఆర్ పై తీవ్రంగా మండిపడ్డారు.
కేసీఆర్ తెలంగాణను అప్పుల పాలు చేశారని కిషన్ రెడ్డి ఆరోపించారు.సంక్షేమం గురించి మాట్లాడే నైతిక హక్కు కేసీఆర్ కు లేదన్నారు.
ఉద్యమకారుల ఆకాంక్షలను నెరవేర్చలేదని మండిపడ్డారు.కేసీఆర్ బంగారు తెలంగాణ చేస్తామని చెప్పారు కానీ కేసీఆర్ కుటుంబం, బీఆర్ఎస్ నేతలు రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని విమర్శించారు.
దళితుడిని సీఎం చేస్తానని చెప్పి కేసీఆర్ మోసం చేశారని మండిపడ్డారు.నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేదన్నారు.
ఈ క్రమంలోనే బీజేపీని ఆశీర్వదించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.







