NTR Chandrababu Pawan Kalyan : ఎన్టీఆర్ ని పట్టించుకోకపోవడం వల్లే బాబుకు ఈ గతి పట్టిందా.. పవన్ ని నమ్ముకుంటే అంతే?

తెలుగు ప్రేక్షకులకు సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ( Tammareddy Bharadwaj ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.తలచు సినిమాలకు అలాగే రాజకీయాలకు సంబంధించిన విషయాల గురించి స్పందిస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు.

 Tammareddy Bharadwaj Interesting Comments On Pawan Kalyan And Jr Ntr Over Chand-TeluguStop.com

ఎక్కువగా కాంట్రవర్సీలు క్రియేట్ చేసే విధంగా కామెంట్స్ చేస్తూ లేనిపోని కాంట్రవర్సీలను కొని తెచ్చుకుంటూ ఉంటారు.ఇది ఇలా ఉంటే తాజాగా తమ్మారెడ్డి భరద్వాజ చంద్రబాబు అరెస్టుపై ఎన్టీఆర్ స్పందించకపోవడంపై మాట్లాడారు.

ఈ సందర్భంగా తమ్మారెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.

చంద్రబాబుని అరెస్ట్( Chandrababu Arrest ) చేస్తే.ఎన్టీఆర్‌కి ఏం సంబంధం? అసలు ఆయన ఎందుకు స్పందించాలి? ఎన్టీఆర్ స్పందించాలని అడిగేవాళ్లకి ఏం సంబంధం? కుటుంబం కదా అని ఎన్టీఆర్ అనుకోవడం కాదు.

Telugu Ap, Chandrababu, Nandamuri, Pawan Kalyan, Tamma Bharadwaj-Movie

అసలు ఆయన్ని ఎప్పుడైనా వీళ్లు కుటుంబంగా చూశారా? కుటుంబంలోని సభ్యుడని అనుకున్నారా? ఎలా కుటుంబం అవుతుంది.నాకు తెలిసీ జూనియర్ ఎన్టీఆర్‌ ని తమ కుటుంబం అని నందమూరి, నారా ఫ్యామిలీ( Nandamuri Nara Families )లు అనుకోలేదు.మధ్యలో కొంతకాలం అనుకున్నారు కానీ, ఎన్టీఆర్ ఎప్పుడూ సెపరేట్ గానే ఉన్నాడు.ఎన్టీఆర్‌కి స్టార్ డమ్ వచ్చిన తరువాత వీళ్లంతా వచ్చారు.నందమూరి తారకరామారావు అని పేరు ఉంది కాబట్టి, ఓన్ చేసుకున్నారు.జూనియర్ ఎన్టీఆర్‌( Junior NTR )ని చంద్రబాబు పిలిచి ఎన్నికల ప్రచారం చేయమంటే వెళ్లి చేశారు.

మధ్యలో ఆయనకి యాక్సిడెంట్ అయ్యింది.పెద్ద ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు.

పార్టీకోసం ప్రాణం పెట్టిన మనిషి జూనియర్ ఎన్టీఆర్.అలాంటి మనిషిని 2014లో వదిలిపెట్టేసి పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లారు.

నేను ఇంట్లో కలవను ఆఫీస్‌లో కలుస్తాని పవన్ కళ్యాణ్ అంటే అప్పుడు మళ్లీ ఆఫీస్‌కి వెళ్లి కలిసి రెండు గంటలు వెయిట్ చేసి మరీ పవన్ కళ్యాణ్‌ని కలిసి పొత్తు పెట్టుకున్నారు.

Telugu Ap, Chandrababu, Nandamuri, Pawan Kalyan, Tamma Bharadwaj-Movie

పవన్ కళ్యాణ్‌( Pawan Kalyan )కి జూనియర్ ఎన్టీఆర్ ఈక్వల్ కేడర్.ఇద్దరి లెవల్ ఒకటే.అలాంటి ఇంటి మనిషి ఎన్టీఆర్‌ని వదిలి పవన్ కళ్యాణ్ దగ్గరకు వెళ్లినప్పుడు ఎన్టీఆర్ ఇప్పుడెందుకు వస్తాడు? ఎందుకు రావాలి? వాళ్లు ఎన్టీఆర్‌ని కాదని పవన్ కళ్యాణ్ దగ్గరకు వెళ్లారంటే ఎన్టీఆర్‌ని వదులుకున్నట్టే కదా.నువ్వొద్దని డైరెక్ట్‌గా చెప్పేసిన తరువాత కూడా ఆయన రాలేదు చేయలేదు అని అడిగే హక్కు టీడీపీ వాళ్లకి ఉందా? అని తమ్మారెడ్డి భరద్వాజ ప్రశ్నించారు.నువ్వు రావాల్సిన అవసరం లేదు.

మాకు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు.మేం చూసుకుంటాం అని చంద్రబాబు ఎన్టీఆర్‌తో చెప్పేశారు.

అలాంటప్పుడు ఎన్టీఆర్ ఎందుకు వస్తారు? ఎన్టీఆర్ ఇంటికి వెళ్లి ప్రచారం చేయమని చంద్రబాబు అడగలేదు.ఇతని ఇంటికి పిలిపించుకుని ప్రచారం చేయమని చెప్పాడు.

ఎన్టీఆర్ చేశారు.

Telugu Ap, Chandrababu, Nandamuri, Pawan Kalyan, Tamma Bharadwaj-Movie

పవన్ కళ్యాణ్ ఇంటికి చంద్రబాబు( Chandrababu ) వెళ్లినప్పుడే నేను ఈ మాట చెప్పాను.ఇంట్లో ఎన్టీఆర్ లాంటి స్ట్రాంగ్ పర్సన్‌ని పెట్టుకుని పవన్ కళ్యాణ్ కోసం వెళ్లి వెయిట్ చేయాల్సిన కర్మ చంద్రబాబుకి ఏమొచ్చింది.తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రి పదేళ్లు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబు పవన్ కళ్యాణ్ కోసం వెళ్లి వెయిట్ చేయాల్సినంత కర్మ ఎందుకొచ్చింది అంటూ బాబుపై మండిపడ్డారు.

తమ్మారెడ్డి చేసిన సోషల్ మీడియాలో వైరల్ అవడంతో కొందరు ఆయన మాటలను ఏకీభవిస్తూ జూనియర్ ఎన్టీఆర్ ను దూరం పెట్టడం వల్లే నేడు చంద్రబాబుకు ఈ పరిస్థితి వచ్చింది అంటూ కామెంట్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube