చంద్రబాబు నాయుడు స్కిల్ అరెస్టు కావడంతో రాష్ట్రంలో పెద్ద ఎత్తున వివాదాలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే.చంద్రబాబు నాయుడు ( Chandra babu Naidu ) కు మద్దతుగా ఎంతో మంది రోడ్లపైకి వస్తు నిరసనలు తెలియజేశారు.
అయితే చంద్రబాబు నాయుడుని అరెస్టు చేయడంతో తెలుగుదేశం పార్టీ వర్సెస్ వైసీపీ( TDP vs YCP ) అన్న విధంగా రాజకీయాలు నడుస్తున్నాయి.ఇకపోతే తెలుగుదేశం పార్టీ నేతలు చంద్రబాబుని కేవలం కక్ష సాధింపు చర్యలో భాగంగానే అరెస్టు చేశారు వైసిపి ప్రభుత్వం పై అలాగే వైసిపి నేతలపై తీవ్ర పదజాలంతో రెచ్చిపోతున్నారు.
ఈ క్రమంలోనే వైసిపి నేతలు కూడా వారికి అదే స్టైల్ లోనే సమాధానం చెబుతున్నారు.

ఇలా వైఎస్ఆర్సిపి తెలుగుదేశం పార్టీ నేతల మధ్య ఈ విషయం గురించి పెద్ద ఎత్తున వార్ జరుగుతుంది.ఇకపోతే సినీ నటి మంత్రి రోజా( Roja ) చంద్రబాబు నాయుడు అరెస్ట్ విషయంలో కాస్త కుతూహలం చూపిస్తూ ఆమె టిడిపి ప్రభుత్వం పై అలాగే టిడిపి నేతలు చేసినటువంటి అరాచకాలపై కూడా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ క్రమంలోనే వైసిపి నేతలు రోజా అని టార్గెట్ చేయడం మొదలుపెట్టారు.
ఇలా తెలుగుదేశం పార్టీ నేతలు రోజాని దూషించడంతో ఆమె కూడా అదే స్టైల్ లోనే సమాధానాలు చెబుతూ వస్తున్నారు.

ఇకపోతే తాజాగా మీడియా సమావేశంలో పాల్గొన్నటువంటి బాలకృష్ణ గారికి మీడియా నుంచి ఇదే ప్రశ్న ఎదురైంది.రోజా టిడిపి ప్రభుత్వం పై ఘాటు విమర్శలు చేస్తున్నారు.ఆమె వ్యాఖ్యలపై మీ స్పందన ఏంటి అని బాలకృష్ణను( Balakrishna ) ప్రశ్నించడంతో బాలయ్య ఒకటే సమాధానం చెప్పారు.
బురద పెంట అని తెలిసినప్పుడు మనం దానిపై రాయి వేయము.రాయి వేస్తే అది మనకే ఇబ్బంది అందుకే ఈ విషయం గురించి నేను కూడా ఏమీ మాట్లాడదలచుకోలేదు ఇది వారి విజ్ఞతకే వదిలేస్తున్నాను అంటూ ఈ సందర్భంగా రోజా వ్యాఖ్యలపై బాలయ్య చెప్పినటువంటి ఈ సమాధానం వైరల్ అవుతుంది.







