దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా పడింది.
ఈ పిటిషన్ పై విచారణ జరిపిన జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ భట్టి ధర్మాసనం విచారణను ఈనెల 12వ తేదీకి వాయిదా వేసింది.
ఈ క్రమంలోనే ధర్మాసనం కీలక ప్రశ్నలను సంధించింది.ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో చాలా మంది నిందితులను చేర్చి రూ.30 కోట్లు, రూ.100 కోట్లు చేతులు మారిందని నివేదికల్లో పేర్కొందన్న న్యాయస్థానం ఎవరికీ ఎవరూ ఇచ్చారన్న ఆధారాలు ఎందుకు సమర్పించలేదని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.ఈ కేసులో సిసోడియా ప్రమేయం ఉందని దినేశ్ అరోరా వాంగ్మూలం తప్ప ఏ ఆధారాలు ఉన్నాయని ప్రశ్నించింది.అనంతరం బెయిల్ పిటిషన్ పై విచారణను వాయిదా వేసింది.







