రామ్ మళ్లీ గ్యాప్ తీసుకుంటే బాగుంటుంది అంటున్న ఫ్యాన్స్‌

ఎనర్జిటిక్ స్టార్‌ రామ్‌( Hero Ram ) హీరోగా రూపొందిన స్కంద సినిమా( Skanda Movie ) వసూళ్ల విషయం లో పర్వాలేదు అన్నట్లుగా నమోదు అవుతున్నాయి అంటున్నారు.ఇప్పటి వరకు రూ.50 కోట్ల కు పైగా వసూళ్లు నమోదు అయ్యాయి అంటూ యూనిట్‌ సభ్యులు ప్రచారం చేస్తున్నారు.కానీ కొందరు మాత్రం అంత సీన్ లేదు.

 Ram Next Movie Interesting Update Details, Hero Ram, Skanda Movie, Boyapati Srin-TeluguStop.com

స్కంద సినిమా కు కనీసం పాతిక కోట్ల వసూళ్లు కూడా నమోదు అయ్యి ఉండవు అంటున్నారు.బోయపాటి( Boyapati Srinu ) దర్శకత్వం లో వచ్చిన స్కంద సినిమా విషయం లో అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూశారు.

వారే స్వయంగా సినిమా బాగాలేదు అన్నట్లుగా పెదవి విరుస్తున్నారు.

Telugu Boyapati, Puri Jagannath, Double Ismart, Ram, Ram Pothineni, Ram Skanda,

పెద్ద ఎత్తున వసూళ్లు వస్తున్నట్లుగా ప్రచారం చేస్తున్నా కూడా నిజమేనా అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.మొత్తానికి రామ్‌ హీరోగా వచ్చిన స్కంద మూవీ తీవ్రంగా నిరాశ పరిచింది.కనుక ఆయన తదుపరి సినిమా డబుల్‌ ఇస్మార్ట్‌ మూవీ( Double Ismart Movie ) కోసం కాస్త ఎక్కువ శ్రద్ద తీసుకోవాల్సిన అవసరం ఉంది అన్నట్లుగా కామెంట్స్ వస్తున్నాయి.

సోషల్‌ మీడియాలో స్కంద సినిమా ఫ్లాప్ అయినా కూడా పూరి తో రామ్‌ చేస్తున్న డబుల్‌ ఇస్మార్ట్‌ మూవీ మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుంది అంటూ నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.

Telugu Boyapati, Puri Jagannath, Double Ismart, Ram, Ram Pothineni, Ram Skanda,

ప్రస్తుతం సినిమా కు సంబంధించిన హడావుడి అయితే ఏమీ లేదు.వచ్చే ఏడాది లో సినిమా విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి.పూరి తో చేస్తున్న సినిమా తర్వాత కచ్చితంగా హీరో రామ్‌ గ్యాప్ తీసుకుని కొత్త సినిమా కమిట్ అయితే బాగుంటుంది అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

ఎందుకంటే కథ విషయం లో రామ్‌ చాలా వర్కౌట్‌ చేయాలి.అలాగే దర్శకుడి విషయం లో కూడా గుడ్డిగా వెళ్లకుండా ప్రతిభావంతుడు అయిన దర్శకుడిని ఎంపిక చేసుకోవాలి అంటూ నెటిజన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు.

మరి రామ్‌ ఎలాంటి నిర్ణయాన్ని తీసుకుంటాడో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube