ఆంధ్ర ప్రదేశ్ లో ప్రసుత రాజకీయ పరిస్థితులు ఎంత ఉద్రిక్త వాతావరణం లో ఉన్నాయో మన అందరికీ తెలిసిందే.మాజీ ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నేత, తెలుగు దేశం పార్టీ జాతీయ అద్యక్ష్యుడు నారా చంద్ర బాబు నాయుడు( Chandrababu Naidu ) స్కిల్ డెవలప్మెంట్ కేసు లో ఏ1 ముద్దాయిగా పరిగణించి సిబిఐ వారు అరెస్ట్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే.
గత 20 రోజుల నుండి ఆయన రాజముండ్రి సెంట్రల్ జైలులో( Rajahmundry Central Jail ) రిమాండ్ లో ఉన్నాడు.ఆయన రాక కోసం తెలుగు దేశం పార్టీ నాయకులు మరియు కోట్లాది మంది కార్యకర్తలు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు.
కానీ రిమాండ్ గడువు తేదీ పొడిగిస్తునే ఉన్నారు కోర్ట్ వారు.
ఇది చంద్రబాబు నాయుడు ని అభిమానించే వారికి మరియు తెలుగు దేశం పార్టీ( TDP ) కార్యకర్తలకు శోక సంద్రం లో ముంచేసే వార్త.73 ఏళ్ళ వయస్సు ఏ రాజకీయ నాయకుడు కూడా చరిత్ర లో కక్ష సాధింపు క్రింద ఇలా చిత్రహింస ని అనుభవించలేదని అంటూ వాపోతున్నారు తెలుగు దేశం పార్టీ అభిమానులు.ఇక నేడు కూడా ఏసిబీ కోర్టు లో కేసు విచారణకి రాగా, చంద్రబాబుని మరో 14 రోజుల పాటు రిమాండ్ లోనే ఉంచాలని ఆదేశాలు జారీ చేసింది.

ఈ సందర్భంగా ఏసీబీ( ACB ) జడ్జీ తీర్పు జారీ చేసాడు.చంద్ర బాబు అరెస్ట్( Chandrababu Arrest ) అయినప్పటి నుండి తెలుగు దేశం పార్టీ కార్యక్రమాలు మొత్తం స్తంభించాయి.ఎంతో ఉత్సాహం గా కార్యకర్తల్లో జోష్ ని నింపుతూ కొనసాగిన లోకేష్ ‘యువగళం’ యాత్ర( Yuvagalam ) గత 20 రోజుల నుండి ఆగిపోయింది.ప్రస్తుతం లోకేష్ ఢిల్లీ లో ఉన్నాడు.
అక్కడ నుండి ఆయన మన రాష్ట్రానికి తిరిగి రాగానే కస్టడీ లోకి తీసుకోవడానికి సిద్ధం గా ఉన్నారట ఏసీబీ అధికారులు.రీసెంట్ గానే వాళ్ళు ఒక గ్రూప్ గా తయారై లోకేష్ ని ఢిల్లీలో కలిసి విచారణ చేపట్టారు.
ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసు లో ఆయన ఏ41 నిందితుడిగా పరిగణించారు.

ఇన్ని సమస్యలు ఉన్నాయి కాబట్టి ఇప్పట్లో లోకేష్( Nara Lokesh ) కూడా ‘యువ గళం’ యాత్ర ని ప్రారంభించడం కష్టమే.పరిస్థితి ఇలాగే ఉంటే ఇక టీడీపీ – జనసేన పార్టీ ఉమ్మడి ముఖ్యమంత్రి అభ్యర్థిగా పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) మాత్రమే ఉండే అవకాశం ఉంది.పవన్ కళ్యాణ్ కి అద్భుతంగా మాట్లాడే సత్తా ఉంది, కోట్లాది మంది అభిమానులు ఉన్నారు.
రాష్ట్రంలో ఏ మూలకి వెళ్లినా లక్షలాదిగా జనాలు తరలి వస్తారు.ఆయన సమర్థవతంగా పొత్తు ని లీడ్ చేయగలరని రాజకీయ విశ్లేషకుల నుండి వెలువడుతున్న అభిప్రాయం, మరి ఏమి జరగబోతుందో చూడాలి.