బీజేపీకి జగనే దిక్కు ?

ఏపీలో పొత్తు వ్యవహారాలు హాట్ హాట్ చర్చలకు దారి తీస్తున్నాయి.ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది ఏ ఏ పార్టీలులు జట్టు కడతాయి.

 Jagan Direction For Bjp, Ys Jagan Mohan Reddy, Bjp, Ap Politics, Jana Sena Party-TeluguStop.com

ఏ ఏ ప్రత్యర్థులుగా మారతాయి అనేది ఊహించడం కష్టంగా మారింది.ముఖ్యంగా ఏపీలో పొత్తులకు సంబంధించిన చర్చ బీజేపీ, జనసేన టిడిపి పార్టీల మద్యనే ఎక్కువగా జరుగుతూ వచ్చింది.

అయితే అటు టీడీపీకి ఇటు బీజేపీకి మొదట మద్యవర్థిత్వ పాత్ర పోషించిన జనసేన పార్టీ( Jana sena ) మొదట బీజేపీతోనే పొత్తు అంటూ చెబుతూ టీడీపీకు కూడా మద్దతు ప్రకటిస్తూ వచ్చింది.కానీ టైమ్ హటాత్తుగా ఇప్పుడు బీజేపీ దోస్తీకి గుడ్ పై చెప్పి టీడీపీతో మాత్రమే పొత్తు అంటూ చెప్పుకొచ్చింది.

Telugu Amit Shah, Ap, Jana Sena, Narendra Modi, Pawan Kalyan, Ysjagan-Politics

దీంతో బీజేపీ ప్రస్తుతం డైలమాలో ఉంది.ఎందుకంటే ఏ పార్టీతో పొత్తు లేకుండా బరిలో దిగి సత్తా చాటే పరిస్థితి బీజేపీకి లేదు.దాంతో ఇన్నాళ్ళు జనసేన అండతో ఏపీలో బలపడాలని చూసిన బీజేపీకి పవన్ ఇచ్చిన షాక్ బీజేపీ వ్యూహాలను తారుమారు చేసింది.ఇప్పుడు బీజేపీ ఎలా వ్యవహరించబోతుంది అనేది అసలు ప్రశ్న.

టీడీపీ జనసేన పార్టీలకు ప్రత్యామ్నాయంగా వైసీపీతో బీజేపీ పొత్తు( BJP ) డిష్గా అడుగ్లు వేసే అవకాశం ఉందా ఏమో గుర్రం ఎగరవచ్చు అన్న రీతిలోనే విశ్లేషకులు వారి అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

Telugu Amit Shah, Ap, Jana Sena, Narendra Modi, Pawan Kalyan, Ysjagan-Politics

ఎందుకంటే కేంద్ర పెద్దలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మద్య మంచి సత్సంబంధాలు ఉన్నాయి.మొదటి నుంచి కూడా వైసీపీకి కేంద్రానికి మద్య అంతర్గత పొత్తు కొనసాగుతుందనే వాదన వినిపిస్తూనే ఉంది.అయితే జనసేనతో పొత్తులో ఉన్న కారణంగా ఇన్నాళ్ళు వైసీపీని నిర్లక్ష్యం చేసిన బీజేపీ పెద్దలు ఇప్పుడు వైసీపీతో దోస్తీకి కొత్త ఎత్తులు వేసే అవకాశం ఉందనేది తాజాగా రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న మాట.అయితే వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఒంటరిగానే బరిలోకి దిగుతుందని జగన్ ఇప్పటికే చాలాసార్లు స్పష్టం చేశారు.దీంతో బీజేపీతో పొత్తుకు జగన్( YS Jagan Mohan Reddy ) ఒప్పుకుంటారా ? అంటే సందేహమే.ఇక తాజాగా జగన్ కేంద్ర పెద్దలతో భేటీ ప్లాన్ చేశారు.ఈ భేటీలో కేంద్ర పెద్దలు పొత్తు వ్యవహారాన్నిప్రతిపాదించే అవకాశం ఉందనేది కొందరి అభిప్రాయం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube