'టైగర్ నాగేశ్వరరావు' ట్రైలర్ పై హరీష్ ఇంట్రెస్టింగ్ రివ్యూ.. ఏమన్నారంటే?

మాస్ మహారాజ రవితేజ( Ravi Teja ) మరో సినిమాతో దసరా బరిలో నిలవబోతున్నాడు.తన కొత్త సినిమాతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధం అవుతున్నాడు.

 Director Harish Shankar Comments On Tiger Nageswara Rao Trailer, Tiger Nageswar-TeluguStop.com

ఆ ప్రాజెక్ట్ ఏంటో మన అందరికి తెలుసు. ”టైగర్ నాగేశ్వరరావు” సినిమాను దసరా కానుకగా రిలీజ్ చేయనున్నారు.

నూతన డైరెక్టర్ వంశీ దర్శకత్వంలో భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాతో రవితేజ కూడా పాన్ ఇండియా స్టార్ గా మారడానికి సిద్ధం అవుతున్నాడు.

ఇప్పటికే ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ తో పాటు టీజర్, సాంగ్ కూడా రిలీజ్ చేసి అంచనాలు పెంచేయగా ఇప్పుడు మొన్న నెక్స్ట్ లెవల్లో ట్రీట్ ఇచ్చారు.ఈ సినిమా ట్రైలర్ ను ముంబైలో గ్రాండ్ గా లాంచ్ చేసారు.ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన ట్రైలర్ నెక్స్ట్ లెవల్లో ఉంది.

ట్రైలర్ లో గ్రాండ్ విజువల్స్ తో పాటు ఎమోషన్స్, ఎలివేషన్స్ అన్ని కూడా ఆడియెన్స్ ను ఆకట్టుకోవడంతో పాటు సినిమాపై అంచనాలు పెంచేసాయి.

ఇదిలా ఉండగా ఈ సినిమా ట్రైలర్ పై ఆడియెన్స్ నుండి మాత్రమే కాదు ప్రముఖుల నుండి కూడా ప్రశంసలు దక్కుతున్నాయి.ఈ క్రమంలోనే టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ ఈ సినిమా ట్రైలర్ పై ఆసక్తికర కామెంట్స్ చేసారు.టెర్రిఫిక్.

ఇంటెన్స్.ఇంట్రెస్టింగ్.

అంటూ కామెంట్స్ చేసారు.ఈయన చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

ఇక పక్కా మాస్ మసాలా ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నుపుర్ సనన్( Nupur Sanon ), గాయత్రీ భరద్వాజ్( Gayatri Bhardwaj ) హీరోయిన్స్ గా నటిస్తున్నారు.ఈ సినిమాకు జివి ప్రకాష్ కుమార్ స్వరాలు అందిస్తుండగా అక్టోబర్ 20న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.

ఇక అనుపమ్ ఖేర్, రేణు దేశాయ్, జిషు సేన్ గుప్తా కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా మన్హసి విజయం సాదిస్తుందని మేకర్స్ నమ్మకంతో ఉన్నారు.మరి రవితేజ( Ravi Teja ) కెరీర్ లో బిగ్గెస్ట్ బ్రేక్ ఇస్తుందో లేదో వేచి చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube