ఏపీ సీఎం వైఎస్ జగన్ మహిళా పక్షపాతి అని మంత్రి రోజా అన్నారు.చరిత్రలో ఎవరూ చేయని విధంగా మహిళల కోసం కృషి చేస్తున్నారని తెలిపారు.
ఎవరో ఏదో తిట్టారని భయపడి వెనకడుగు వేయొద్దని మంత్రి రోజా పేర్కొన్నారు.మహిళల కోసం తాను ఎంతో పోరాటం చేశానన్న రోజా ఉద్యమాలు కూడా చేసినట్లు తెలిపారు.
మహిళలు విమర్శలకు భయపడి పారిపోకూడదని, పోరాటం చేయాలన్నారు.మహిళా సాధికారతకు పాటుపడుతున్నానని రోజా చెప్పుకొచ్చారు.
గత 20 ఏళ్లుగా పాలిటిక్స్‌లో ఉన్నానని.తాను మంత్రిగా ఎదిగితే చూసి ఓర్వలేక తనపై కొందరు అనుచిత వాఖ్యలు చేసి బాధపెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
అయితే విమర్శలకు తాను భయపడేది లేదని స్పష్టం చేశారు.







