భార్యాభర్తల మధ్య గొడవ.. మధ్యలో వెళ్లిన వ్యక్తి దారుణ హత్య..!

ఇటీవలే కాలంలో మనుషులను దారుణంగా హత్య చేయడానికి పెద్ద పెద్ద కారణాలు అవసరం లేదు.ఏవో చిన్నపాటి మనస్పర్ధలు ఉంటే చాలు దారుణంగా హత్యలు చేసేస్తున్నారు.

 Man Died By Interfering In Wife Husband Conflict In East Godavari Details, Man D-TeluguStop.com

ఇలాంటి కోవలోని భార్యాభర్తల గొడవ మధ్యలో తలదూర్చిన వ్యక్తి చివరికి దారుణ హత్యకు గురైన ఘటన తూర్పుగోదావరి జిల్లాలోని( East Godavari ) పి.నాయకంపల్లి లో చోటుచేసుకుంది.అందుకు సంబంధించిన వివరాలు ఏమిటో చూద్దాం.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.

గండేపల్లి మండలం లోని పి.నాయకంపల్లి కి చెందిన గంధం అబ్బులు (62)( Gandham Abbulu ) పంచాయితీ స్వీపర్ గా పనిచేస్తున్నాడు.అయితే అబ్బులు ఇంటి ఎదురుగా ఉండే నివాసం ఉండే గంధం విజయ్ కుమార్, శాంతమ్మ దంపతుల మధ్య మంగళవారం సాయంత్రం గొడవ జరిగింది.విజయ్ కుమార్( Vijay Kumar ) తన భార్యను విచక్షణ రహితంగా తిడుతూ ఉండడంతో అబ్బులు జోక్యం చేసుకొని ఎందుకు అలా తిడుతున్నావని ప్రశ్నించాడు.

Telugu Godavari, Gandham Abbulu, Gandhamvijay, Nayakampalli, Shantamma, Conflict

అందుకు విజయ్ కుమార్ నీకేంటి సంబంధం, నా భార్యను నేను తిట్టుకుంటాను, అవసరం వస్తే కొడతాను అని అనడంతో ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగి గొడవకు దారితీసింది.విజయ్ కుమార్ క్షణికావేశంలో పక్కనే ఉన్న కర్రతో అబ్బులు పై దాడి చేశాడు.అబ్బులు కూడా కర్రతో విజయ్ కుమార్ పై దాడి చేశాడు.విజయ్ కుమార్ తలకు దెబ్బ కాస్త బలంగా తగలడంతో స్థానికంగా ఉన్న పీఎంపీ వైద్యునితో చికిత్స చేయించి, అబ్బులు తన ఇంటికి వెళ్ళిపోయాడు.

Telugu Godavari, Gandham Abbulu, Gandhamvijay, Nayakampalli, Shantamma, Conflict

అయితే అర్థరాత్రి విజయ్ కుమార్ తో పాటు అతని సమీప బంధువులు అబ్బులు పై దాడి చేయడంతో అక్కడికక్కడే అబ్బులు ప్రాణాలు విడిచాడు.పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వర్తించేందుకు పెద్దాపురం ప్రభుత్వ ఆసుపత్రికి( Peddapuram Govt Hospital ) తరలించారు.హత్య కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు జగ్గంపేట సీఐ బి.సూర్యఅప్పారావు తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube