కెనడా : మానిటోబా ప్రావిన్స్ అసెంబ్లీ ఎన్నికల్లో ముగ్గురు ఎన్ఆర్ఐల విజయం

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం వివిధ దేశాలకు వలస వెళ్లిన భారతీయులు( Indians ) ఆయా దేశాల్లో కీలక స్థానాల్లో వున్న సంగతి తెలిసిందే.భారత సంతతి క్రమంగా పెరగడంతో అక్కడి వ్యవస్థలను శాసించే స్థాయికి చేరుకున్నారు .

 Canada 3 Nris Enter Manitoba Provincial Assembly , Canada, Indians, Justin Trude-TeluguStop.com

భారతీయులు పెద్ద సంఖ్యలో స్థిరపడిన దేశాల్లో కెనడా( Canada ) కూడా ఒకటి.దశాబ్దాల క్రితం నుంచే మనోళ్లు ఈ దేశంలో స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు.

క్రమేణా ఈ సంఖ్య పెరుగుతూ ఇప్పుడు తారాస్థాయికి చేరింది.ఇక కెనడియన్ రాజకీయాల్లో భారతీయుల ప్రాబల్యం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

అన్ని పార్టీల్లోనూ , ప్రభుత్వంలోనూ ఇండో కెనడియన్లు కీలక స్థానాల్లో వున్నారు.ప్రస్తుతం దేశంలో అధికారంలో వున్న జస్టిన్ ట్రూడో ( Justin Trudeau )ప్రభుత్వానికి భారత సంతతికి చెందిన జగ్మీత్ సింగ్( Jagmeet Singh ) సారథ్యంలోని ‘‘న్యూ డెమొక్రాటిక్ పార్టీ’’ మద్ధతు ప్రకటించిన సంగతి తెలిసిందే.

జగ్మీత్ అండతోనే ట్రూడో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రధాని కాగలిగారు.ఇప్పుడు జగ్మీత్ ఒత్తిడితోనే నిజ్జర్ హత్యపై సంచలన వ్యాఖ్యలు చేసి వివాదంలో చిక్కుకున్నారు ట్రూడో.

Telugu Canada, Diljitbrar, Indians, Jagmeet Singh, Jasdeep Devgan, Justin Trudea

ఈ సంగతి పక్కనబెడితే.మానిటోబా ప్రావిన్షియల్ అసెంబ్లీకి ముగ్గురు భారత సంతతి నేతలు ఎన్నికయ్యారు.వీరు ముగ్గురూ పంజాబీ మూలాలున్న వారు కావడం విశేషం. దిల్జీత్ బ్రార్ బర్రోస్ ( Diljit Brar Burrows )నుంచి.మింట్ సంధు( Mint sandhu ) (సుఖ్జిందర్ పాల్) ది మాపుల్స్ నుంచి.జస్దీప్ దేవగన్( Jasdeep Devgan ) మెక్ ఫిలిప్స్ నుంచి ఎన్నికయ్యారు.

అంతేకాదు.వీరు ముగ్గురూ న్యూ డెమొక్రాటిక్ పార్టీకి చెందినవారే.

తద్వారా ఎన్డీపీ ఇక్కడ మెజారిటీని సొంతం చేసుకుని.మానిటోబాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది.

అంతేకాదు బ్రార్, సంధు ఇద్దరూ కేబినెట్ పదవి రేసులో వున్నారు.

Telugu Canada, Diljitbrar, Indians, Jagmeet Singh, Jasdeep Devgan, Justin Trudea

మొత్తం తొమ్మిది మంది పంజాబీ మూలాలున్న నేతలు మానిటోబా ప్రావిన్షియల్ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచారు.బర్రోస్ నుంచి నవ్‌రాజ్ బ్రార్, ది మాపుల్స్ నుంచి సుమిత్ చావ్లా, సెయింట్ బోనిఫేస్ నుంచి కిర్ట్ హేయర్, ఫోర్ట్ రిచ్‌మండ్ నుంచి పరమ్‌జిత్ షాహి, వేవర్లీ నుంచి మంజిత్ కౌర్ గిల్, సౌత్‌డేల్ నుంచి అమర్‌జిత్ సింగ్‌లు పోటీపడగా.ప్రత్యర్ధుల చేతిలో ఓటమి పాలయ్యారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube