ఓట్ల తొలగింపులో అసలు దొంగ తెలుగుదేశం పార్టీనేనని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు.ఈ మేరకు ఓట్ల తొలగింపు చేపడుతున్న నారాయణ కాలేజీ సిబ్బందిపై కేసులు పెట్టిస్తామని తెలిపారు.
వైసీపీకి బలమున్న ప్రాంతాల్లో కావాలనే ఓట్లు తొలగిస్తున్నారని మాజీ మంత్రి అనిల్ కుమార్ ఆరోపించారు.సర్జరీలు జరిగాయని అబద్ధాలు చెబుతూ కోర్టులను నారాయణ మోసం చేస్తున్నారని మండిపడ్డారు.
మాజీ మంత్రి నారాయణ వైట్ కాలర్ క్రిమినల్ అన్న అనిల్ కుమార్ రైతుల దగ్గర నుంచి ఆయన వందల కోట్లు దోచుకున్నారని ఆరోపణలు చేశారు.







