బాక్సాఫీస్ వద్దకి అరడజను సినిమాలు... ఒక్కటైనా మెప్పించేనా?

ప్రతి వారం తెలుగు బాక్సాఫీస్ వద్ద సినిమాల సందడి చూస్తూనే ఉంటాం.పెద్ద హీరోల సినిమా లు ఉన్నప్పుడు ఒకటి రెండు మాత్రమే విడుదల అవుతాయి.

 October 6th 6 Movies Coming For Tollywood Box Office Rules Ranjan Mad Month Of M-TeluguStop.com

చిన్న హీరోల సినిమా లు మాత్రమే విడుదల అయిన సమయంలో మాత్రం చాలా ఎక్కువ సంఖ్య లో సినిమా లు బాక్సాఫీస్ వద్ద సినిమా లు సందడి చేయడం మనం ఎప్పుడూ చూస్తూనే ఉంటాం.ఈ వారం తెలుగు బాక్సాఫీస్ వద్దకు ఏకంగా ఆరు సినిమా లు రాబోతున్నాయి.

ఆ ఆరు సినిమా లకు కూడా ఒక మోస్తరు బజ్ క్రియేట్ అయింది.ఆ ఆరు సినిమాల విషయానికి వస్తే మొదటిది కిరణ్ అబ్బవరం నటించిన రూల్స్ రంజన్( Rules Ranjan ) సినిమా.

నేహా శెట్టి హీరోయిన్‌ గా నటించడం వల్ల అంచనాలు భారీగా ఉన్నాయి.

Telugu Chithha, Kiran Abbavaram, Mad, Madhu, Neha Shetty, Ranjan, Tollywood-Movi

ఇక రెండో సినిమా మ్యాడ్‌.( Mad Movie ) ఈ సినిమా ను జాతిరత్నాలు సినిమా తో పోల్చుతూ భారీ ఎత్తున విడుదల చేసేందుకు రెడీ చేశారు.ఈ సినిమా జాతిరత్నాలకు ఏమాత్రం తీసి పోకుండా యూత్ కి వినోదాన్ని పంచుతుంది అంటున్నారు.

ఇక మూడవ సినిమా మంత్ ఆఫ్ మధు.( Month Of Madhu ) ఈ సినిమా చాలా విభిన్నంగా ఉంటుంది అంటూ సినిమా లో నటించిన నవీన్‌ చంద్ర మరియు స్వాతి లు అంటున్న ఈ సినిమా కోసం చాలా ఎక్కువగానే పబ్లిసిటీ చేశారు.

Telugu Chithha, Kiran Abbavaram, Mad, Madhu, Neha Shetty, Ranjan, Tollywood-Movi

ఇక నాల్గవ సినిమా విషయానికి వస్తే… మామ మశ్చీంద్ర.( Mama Mascheendra ) ఈ సినిమా లో సుధీర్ బాబు హీరో గా నటించాడు.విభిన్నమైన గెటప్ లో సుధీర్ బాబు కనిపించబోతున్నాడు.అయిదవ సినిమాగా 800 విడుదల అవ్వబోతుంది.ముత్తయ్య మురళీ ధరన్ బయోపిక్ గా ఈ సినిమా రూపొందిన విషయం తెల్సిందే.ఇక చివరిగా సిద్దార్థ్‌ హీరోగా నటించి నిర్మించిన చిత్తా ను( Chithha ) తెలుగు లో చిన్నా గా డబ్బింగ్‌ చేసి విడుదల చేయబోతున్నారు.

ఈ సినిమా లన్నీ కూడా అక్టోబర్‌ 6న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.కనుక బాక్సాఫీస్ వద్ద ఈ ఆరు సినిమా లు ఏ స్థాయి లో సత్తా చాటుతాయి అనేది చూడాలి.

వీటిల్లో ఒకటి రెండు అయినా మెప్పించేనా చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube