దివంగత నటి శ్రీదేవి( Sridevi ) వారసురాలు అయినటువంటి జాన్వీ కపూర్( Janhvi Kapoor ) ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలతో పాటు సౌత్ సినిమాలలో కూడా నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న సంగతి మనకు తెలిసిందే.ఈమె ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న దేవర సినిమా(Devara Movie) షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నారు.
ఈ సినిమా ద్వారా సౌత్ ప్రేక్షకులకు పరిచయం కాబోతున్నారు.ఇలా ఒకవైపు బాలీవుడ్ సినిమాలతో పాటు మరోవైపు సౌత్ సినిమాలలో కూడా నటించే అవకాశాలను అందుకుంటున్నారు.
ఇక శ్రీదేవి మరో కుమార్తె ఖుషి కపూర్ కూడా త్వరలోనే ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారు.

ప్రస్తుతం నటనలో శిక్షణ తీసుకుంటూ ఉన్నటువంటి ఖుషి కపూర్ త్వరలోనే ఇండస్ట్రీలోకి రాబోతుంది అంటూ ఒక వార్త వైరల్ గా మారింది.అయితే ఇండస్ట్రీలోకి రాకముందే ఈమెకు కూడా విపరీతమైనటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి మనకు తెలిసిందే.తరుచూ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఉంటారు.
ఈ క్రమంలోనే ఈమెకు విపరీతమైనటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

తాజాగా ఖుషి కపూర్ ( Kushi Kapoor ) ప్యారిస్ వెకేషన్ లో ఉన్నట్టు తెలుస్తుంది.ఈ క్రమంలోనే ఈమె తన వెకేషన్ కి సంబంధించినటువంటి కొన్ని ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.ఇందులో మిని స్కర్ట్ వేసుకొని చాలా స్టైలిష్ లుక్ లో కనిపిస్తున్నటువంటి ఖుషి కపూర్ తన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఈ ఫోటోలపై నటి జాన్వీ కపూర్ రియాక్ట్ అవుతూ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
ఈ ఫోటోలపై జాన్వీ స్పందిస్తూ.అద్భుతమైన యువరాణి, నా లడ్డూ, నా జాంగ్రీ, నా మైసూర్ పాక్, నా బంగారం అంటూ చెల్లెలిపై ప్రేమవర్షం కురిపించింది.జాన్వీ కామెంట్ చూసిన నెటిజన్లు చెల్లి పై తనకు ఇంత ప్రేమ ఉందా ఆశ్చర్యపోతున్నారు.







