ప్రస్తుత కాలంలో ఎంత పెద్ద నిర్మాత అయినా భారీ బడ్జెట్ మూవీ ఫ్లాప్ అయితే ఇబ్బందులు పడక తప్పదు.పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన అజ్ఞాతవాసి మూవీ డిజాస్టర్ గా నిలవడంతో పాటు భారీ నష్టాలను మిగిల్చిన సంగతి తెలిసిందే.
కథ, కథనం ఆకట్టుకునేలా లేకపోవడంతో పాటు ఈ సినిమా లార్గో వించ్ అనే సినిమాకు కాపీ అనే ఆరోపణలు రావడం కూడా ఈ సినిమా ఫలితంపై ప్రభావం చూపింది.అయితే పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) సినిమా మిగిల్చిన నష్టాలను యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అరవింద సమేత మూవీ భర్తీ చేసిందని నిర్మాత నాగవంశీ చెప్పుకొచ్చారు.
జీవితంలో కొన్ని ఛాలెంజింగ్ మూమెంట్స్ ఉంటాయని అవి బయటకు చెప్పుకోలేమని ఆయన అన్నారు.అలాంటివి చాలా ఉంటాయని ఆయన తెలిపారు.
మోస్ట్ ఛాలెంజింగ్ మూమెంట్ మాత్రం అజ్ఞాతవాసి( Agnyaathavaasi ) అని నాగవంశీ చెప్పుకొచ్చారు.

అజ్ఞాతవాసి మూవీ జనవరిలో విడుదలైందని ఆ సినిమా నుంచి బయటపడటానికి మాకు రెండు నెలల సమయం పట్టిందని ఆయన అన్నారు.మేము చాలా ఇబ్బందిలో ఉన్న సమయంలో తారక్ అన్న చాలా సహాయం చేశాడని నాగవంశీ వెల్లడించారు.అజ్ఞాతవాసి దెబ్బ నుంచి మమ్మల్ని బయటకు తెచ్చాడని ఆయన చెప్పుకొచ్చారు.
అదే సంవత్సరం సక్సెస్ కొట్టి చూపిద్దామంటూ ప్రోత్సహించాడని నాగవంశీ అన్నారు.

అరవింద సమేత సినిమా( Aravinda Sametha Veera Raghava ) సక్సెస్ తో నష్టాల నుంచి కొంత తేరుకున్నామని నాగవంశీ కామెంట్లు చేశారు.తమ బ్యానర్ లో వచ్చిన సినిమాలలో అల వైకుంఠపురములో సినిమా చాలా ఇష్టమని నాగవంశీ చెప్పుకొచ్చారు.డేట్స్ ఎడ్జెస్ట్ చేయలేక పూజా హెగ్డే గుంటూరు కారం నుంచి తప్పుకుందని అంతకుమించి మరే కారణం లేదని ఆయన కామెంట్లు చేశారు.
నాగవంశీ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతుండటం గమనార్హం.