మరోసారి ఢిల్లీ ప్రయాణం పెట్టుకున్నారు వైసిపి అధినేత, ఏపీ సీఎం జగన్.( Ap CM jagan ) ఢిల్లీకి వెళ్లి కేంద్ర బిజెపి పెద్దలను కలిసి ఏపీకి సంబంధించిన అనేక అంశాలపై చర్చించడంతో పాటు, టిడిపి అధినేత చంద్రబాబు అరెస్ట్, లోకేష్ తో పాటు టిడిపి కీలక నేతలు చాలామందికి అనేక అవినీతి వ్యవహారాల్లో భాగస్వామ్యం ఉందని, త్వరలోనే లోకేష్ తో పాటు, మరి కొంత మంది కీలక నేతలను అరెస్టు చేయబోతున్నాం అనే విషయాన్ని బిజెపి పెద్దలు వద్ద ప్రస్తావించి వారి అనుమతి తీసుకోవాలనే ఆలోచన ఉన్నారట.
దీనిలో భాగంగానే ఈనెల 6న జగన్ ఢిల్లీకి వెళ్లనున్నట్లు సమాచారం.బిజెపితో అధికారకంగా పొత్తు లేకపోయినా, వైసిపి ప్రభుత్వం మాత్రం బిజెపితో సన్నిహితంగానే మెలుగుతోంది.

కేంద్రం తీసుకున్న ప్రతి నిర్ణయానికి జగన్ ( CM jagan )మద్దతు తెలుపుతూ వస్తున్నారు.బిజెపి ప్రభుత్వానికి అనుకూలంగా వైసీపీ ఎంపీలు ఓటింగ్ లో పాల్గొంటున్నారు.దీంతో ఏపీలో జగన్ ప్రభుత్వానికి ఎటువంటి ఇబ్బందులు రాకుండా బీజేపీ కేంద్ర పెద్దలు చూసుకుంటున్నారు.అయితే అధికారికంగా మాత్రం వైసిపి, బిజెపిలు పొత్తు పెట్టుకోలేదు.మరోవైపు బిజెపికి దగ్గర అయ్యేందుకు టిడిపి ( TDP )అనేక ప్రయత్నాలు చేస్తోంది. జనసేన ద్వారా బిజెపి పెద్దలను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నా ఆ ప్రయత్నాలు సక్సెస్ కావడం లేదు.</b

ఇది ఇలా ఉంటే టిడిపి అధినేత చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ స్కాం లో అరెస్ట్ చేసిన సమయంలో జగన్( CM jagan ) లండన్ పర్యటనలో ఉన్నారు .ఇక చంద్రబాబు అరెస్టు వ్యవహారంలో కేంద్ర బిజెపి పెద్దల సహకారం కూడా జగన్ కు ఉందని, వారి ద్వారానే టిడిపి కీలక నాయకులను టార్గెట్ చేసుకుని అరెస్టుల పరంపరకు శ్రీకారం చుట్టబోతున్నారనే ప్రచారం జరుగుతోంది .ఈ సమయంలోనే జగన్ ఢిల్లీకి వెళుతుండడం ప్రాధాన్యం సంతరించుకుంది.అయితే వైసిపి మాత్రం జగన్ పర్యటనలో విశేషం ఏమీ లేదని, ఎప్పటి నుంచో ఏపీకి సంబంధించిన సమస్యలను పరిష్కరించాల్సిందిగా కేంద్ర బీజేపీ పెద్దలను కోరుతున్నారని, ఇప్పుడూ ఆ విషయంపై నే ఢిల్లీకి వెళ్తున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
.






