ప్రపంచమే ఇపుడు స్మార్ట్ అయిపోయింది.ఇక స్మార్ట్ గ్యాడ్జెట్లు( Smart gadgets ) గురించి ఇక్కడ ప్రత్యేకంగా చెప్పాలా? ఇవాళ, రేపు చదువులేనివాళ్లు కూడా వీటిని విరివిగా వాడడం మనం చూస్తూ వున్నాము.ఈ క్రమంలోనే చాలామంది మనదగ్గర ఇపుడు ఇలాంటి గ్యాడ్జెట్లు వాడుతూ తమ ఇంట్లో పనులు సులభంగా చేసుకుంటున్నారు.ఇంకా వాటిని ఇంటిలో కూర్చొనే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుంటున్నారు చాలామంది.
అలాంటివాటిలో కొన్ని ఆసక్తికరమైన కొన్ని గ్యాడ్జెట్లు గురించి ఇక్కడ చూద్దాము.

ముందుగా ఇక్కడ “మినీ ఫుడ్ సీలర్ ( mini food sealer )” గురించి మాట్లాడుకోవాల్సిందే.ఇపుడు దాదాపుగా మనం బజార్ నుంచి కొని తెచ్చుకునే పచారీ సామాను అన్నీ దాదాపుగా ప్లాస్టిక్ కవర్స్ లో వస్తున్నాయి.వాటిని వాడాక మరలా పురుగులు పట్టకుండా సీల్ వేసుకోవచ్చు.
దానికి ఈ మినీ ఫుడ్ సీలర్ అనేది బాగా ఉపయోగపడుతుంది.కాగా ఇది మనకు చాలా తక్కువ ధరలోనే అందుబాటులో వుంది.
ఆ తరువాత చెప్పుకోదగ్గ స్మార్ట్ గ్యాడ్జెట్టు “వైర్ లెస్ డోర్ బెల్ ( wireless door bell )” సాధారణంగా ఇపుడు దాదాపుగా ప్రతి ఇంటిలోనూ కాలింగ్ బెల్ ఉంటుంది.స్విచ్ ఆన్ చేస్తే ఇంటిలో మోగుతుంది.
అయితే దానికి సంబందించిన వైరింగ్ తప్పనిసరిగా ఉండాలి.అలా కాకుండా వైర్‌లెస్ డోర్ బెల్స్ అందుబాటులోకి వచ్చేశాయి.

వీటివలన ఉపయోగం ఏమిటంటే దీంట్లో బెల్ స్విచ్ ఒకటి, రిసీవర్ ఒకటి రెండూ సెట్‌గా వస్తాయి.కాలింగ్ బెల్‌ని ఇంటి బయటి తలుపు దగ్గర అంటించుకొని రిసీవర్ డివైజ్‌ని ఇంట్లో ఏదో ఒక ప్లగ్‌లో పెట్టి స్విచ్ ఆన్ చేసుకుంటే సరిపోతుంది.అదే పని ఈ గాడ్జెట్ చేసిపారేస్తుంది.ఇక చివరగా ఇక్కడ “స్పాంజ్ హోల్డర్ ప్లాస్టిక్ లిక్విడ్ సోప్ డిస్పెంసర్ ( Sponge Holder Plastic Liquid Soap Dispenser ) గురించి మాట్లాడుకోవాలి.
ఇంట్లో ఆడవాళ్ళు సింక్ దగ్గర ఎన్నో రకాల పనులను చేస్తూ వుంటారు.అక్కడ శుభ్రం అనేది చాలా అవసరం.ఈ గాడ్జెట్ ఉంటే మనం వాడే సోప్ లిక్విడ్ మరియు పీచు అన్నీ దానిలోనే పెట్టుకోవచ్చన్నమాట.







