తెలుగుదేశం పార్టీ నేత బండారు సత్యనారాయణ( Bandaru Satyanarayana ) తనపై చేసిన వ్యాఖ్యలకు మీడియా ముందు మంత్రి రోజా( Minister Roja ) కన్నీరు పెట్టుకున్నారు.బండారు సత్యనారాయణమూర్తి మాటలతో మహిళలు భయపడుతున్నారు.
రాజకీయాల్లో ఉన్న మహిళ గురించి ఇంత నీచంగా మాట్లాడితే.ఏ స్త్రీ అయినా రాజకీయాల్లో ముందుకు నడవాలని అనుకుంటుందా? సిగ్గు లేకుండా బండారు సత్యనారాయణకి మద్దతుగా నారా లోకేష్ నిన్న ట్వీట్ చేశారు.పదేళ్లు తెలుగు దేశం పార్టీ కోసం పనిచేశా.కానీ.రాజకీయంగా నష్టపోయి.అవమానాలు తట్టుకోలేక చివరికి దండం పెట్టేసి పార్టీ నుంచి బయటికి వచ్చేశా.
అయినా ఇంకా వేధిస్తున్నారు.అంటూ మంత్రి రోజా కన్నీరు పెట్టుకున్నారు.

బండారు మాట్లాడిన మాటలు చెప్పాలంటే అసహ్యం వేస్తోంది.ఇలాంటి నేతలు ఉండటం వల్ల రాజకీయాల్లోకి మహిళలు రావాలంటేనే భయపడుతున్నారు.బండారు సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలను సమర్ధించటం సరికాదు.లోకేష్ తో( Nara Lokesh ) పాటు ఇతర టీడీపీ నేతలు( TDP Leaders ) అరెస్టును ఖండించారు.
వారి తల్లులు, భార్యలు, కూతుళ్లకు కూడా ఇదే పరిస్థితి ఎదురైతే ఇలాగే చేస్తారా.అంటూ మంత్రి రోజా తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.బ్లూ ఫిలింలో నటించింది.అంటూ తెగ టార్చర్ చేస్తున్నారు.
అసెంబ్లీలో సీడీలను కూడా చూపించారు.కానీ ఎప్పుడూ కూడా నిరూపించలేదు.
మహిళలు నచ్చినట్లు బతకమని సుప్రీంకోర్టే చెప్పింది.మీరెవరు నా క్యారెక్టర్ నీ జడ్జ్ చేయడానికి.
మహిళలను తెలుగుదేశం పార్టీ ఆట వస్తువుల్లా చూస్తోంది అని మంత్రి రోజా సీరియస్ వ్యాఖ్యలు చేశారు.







