టీడీపీ నేత నారా లోకేశ్ ముందస్తు బెయిల్ పిటిషన్ డిస్మిస్ అయింది.ఏపీ ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ లోకేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన ధర్మాసనం పిటిషన్ ను కొట్టివేసింది.ఫైబర్ నెట్ కేసులో లోకేశ్ నిందితుడు కాదని అడ్వొకేట్ జనరల్ అన్నారు.లోకేశ్ ను నిందితుడిగా చేరిస్తే 41ఏ నోటీసు ఇస్తామని ఆయన తెలిపారు.41ఏ నోటీసును లోకేశ్ అనుసరించకపోతే హైకోర్టుకు తెలుపుతామని పేర్కొన్నారు.ఈ క్రమంలో ప్రొసీజర్ ఫాలో అవుతామని అడ్వొకేట్ జనరల్ చెప్పిన అంశాన్ని నోట్ చేసుకున్న న్యాయమూర్తి పిటిషన్ ను క్లోజ్ చేశారు.







