తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్( Tollywood ) పాన్ ఇండియా హీరో ప్రభాస్( Hero Prabhas ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.బాహుబలి సినిమాతో పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ ఆ తర్వాత వరుసగా పాన్ ఇండియా సినిమా లలో నటిస్తూ దూసుకుపోతున్నారు.
ఇక ప్రస్తుతం ప్రభాస్ చేతిలో రెండు మూడు సినిమాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే.అవన్నీ కూడా పాన్ ఇండియా ప్రాజెక్టు లే.అందులో ఇప్పటికే సలార్ సినిమా షూటింగ్ ని పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది.ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.

ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని అభిమానులు సెలబ్రిటీలు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.మామూలుగా ప్రభాస్ ఎయిర్ పోర్ట్ లో కనిపించిన సమయంలో అభిమానులు ఫోటోల కోసం దిగబడుతూ ఉంటారు.ఆ సమయంలో ప్రభాస్ నవ్వుతూ ఫ్యాన్స్ కి సెల్ఫీలు ఇస్తూ ఉంటారు.అయితే తాజాగా సోషల్ మీడియాలో ప్రభాస్‌కు సంబంధించిన ఒక వీడియో వైరల్ గా మారింది.
ఆ వీడియలో ప్రభాస్ చెంపపై ఒక లేడీ ఫ్యాన్ కొట్టిన విజువల్స్ వైరల్ అవుతున్నాయి.ఆ వీడియోలో ప్రభాస్‌ను చూసి అతడితో సెల్ఫీ దిగేందుకు చాలా ఉత్సాహంగా ఉన్న ఒక లేడి ఫ్యాన్ అతని ముఖంపై సరదాగా చెంపదెబ్బ కొట్టినట్లు కనిపించింది.

క్లిప్‌లో, ఒక మహిళా అభిమాని ప్రభాస్‌ను సెల్ఫీ కోసం అడిగింది.సెల్ఫీ దిగాక ఆమె సరదాగా ప్రభాస్ చెంపపై కొట్టింది.ఈ ఫోటో క్లిక్ చేసిన తర్వాత, ఆమె నటుడి ముఖాన్ని సున్నితంగా కొట్టింది.ఈ వీడియో వాస్తవానికి 2019లో ఇన్‌స్టాగ్రామ్‌లో Telugutiktok_official ద్వారా ఆన్‌లైన్‌లో భాగస్వామ్యం చేయబడింది.
ఆ వీడియో ఇప్పుడు మరోసారి నెట్టింట వైరల్ అవుతోంది.ఇకపోతే ప్రభాస్ విషయానికి వస్తే.
ప్రస్తుతం ప్రభాస్ వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు.ఆదిపురుష్ తర్వాత ప్రశాంత్ నీల్‌తో కలిసి సలార్ ప్రాజెక్టు చేస్తున్నాడు.
ఇటీవలే దీని విడుదల తేదీ డిసెంబర్ 22గా ఖరారు చేశారు.







