Lakshmi Parvathi : ఎన్టీఆర్ చనిపోవాలని క్షుద్ర పూజలు చేశారా… షాకింగ్ విషయాలు బయటపెట్టిన లక్ష్మీపార్వతి!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి సీనియర్ దివంగత నటుడు స్వర్గీయ నందమూరి తారకరామారావు( Tharakaramarao ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి తెలుగు చిత్ర పరిశ్రమకు ఎన్నో సేవలు అందించినటువంటి ఎన్టీఆర్ మధ్యలోనే సినిమాలకు స్వస్తి చెప్పి రాజకీయాలలోకి వెళ్లారు.

 Lakshmi Parvatis Sensational Comments Saying Occult Pooja To Kill Ntr-TeluguStop.com

ఇలా రాజకీయాలలోకి వచ్చినటువంటి ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని( Telugu Desam Party ) స్థాపించి అతి తక్కువ సమయంలోనే ముఖ్యమంత్రిగా ఎంపిక అయ్యారు.ఇలా పార్టీ స్థాపించిన తొమ్మిది నెలలలోనే ఎవరు కూడా ముఖ్యమంత్రి అయినటువంటి దాఖలాలు లేవు.

ఎన్టీఆర్ సినిమాలలో నటిస్తూ ఎంతో మంచి క్రేజ్ సొంతం చేసుకొని ఈయన మాత్రమే పార్టీ పెట్టిన అతి తక్కువ సమయంలోనే ఇలా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.ఇక ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్ర ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఎంతో మంచి సేవా కార్యక్రమాలను చేశారు.

ఇక ఎన్టీఆర్ మరణాంతరం చంద్రబాబు నాయుడు పార్టీ పగ్గాలను తన చేతులలోకి తీసుకొని ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగుతూ పార్టీని ముందుకు తీసుకువచ్చారు.అయితే ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కున్నారు అంటూ చంద్రబాబు( Chandrababu ) పై ఇప్పటికి ప్రతిపక్షాలు విమర్శలు చేస్తూనే ఉంటాయి.

ఇకపోతే తాజాగా చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్ స్కామ్ లో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే.ఇలా ఈయన అరెస్టు కావడంతో ఎంతోమంది ఈయన అరెస్టును వ్యతిరేకిస్తూ నిరసనలు తెలియజేస్తున్నారు.

కానీ తండ్రికి వెన్నుపోటు పొడిచినటువంటి వ్యక్తి అరెస్ట్ అవడంతో నందమూరి కుటుంబ సభ్యులకు కూడా ఆయనకు వత్తాసు పలకడంతో ఎన్టీఆర్ రెండో భార్య లక్ష్మీ పార్వతి( Lakshmi Parvathi ) ఈ విషయంపై మాట్లాడుతూ సంచలన విషయాలను బయటపెట్టారు.భర్త అధికారం కోసం నారా భువనేశ్వరి ఏ తండ్రికి చేయని ద్రోహం ఎన్టీఆర్ గారికి చేసిందని ఈమె తెలిపారు.

Telugu Kills, Lakshmi Parvati, Bhuvaneshwari, Pooja, Sensational-Movie

ఈ సందర్భంగా లక్ష్మీపార్వతి మాట్లాడుతూ ఎన్టీఆర్ చనిపోవాలని ఆయన కూతురు అయినటువంటి నారా భువనేశ్వరి ( Nara Bhuvaneshwari )అప్పట్లో క్షుద్ర పూజలు చేయించింది అంటూ సంచలన విషయాలను లక్ష్మీపార్వతి బయట పెట్టారు.ఈ విషయం ఎన్టీఆర్ కి తెలిసి చాలా బాధపడ్డారని కూడా తెలియజేసింది.ఎన్టీఆర్ తనని పెళ్లి చేసుకున్నప్పుడు కానీ లేదా ఆయన బ్రతికున్నప్పుడు ఎన్నో ఇబ్బందులు పడుతున్న సమయంలో కూడా ఎవరు తనని చూడటానికి రాలేదని ఈమె తెలియజేశారు కానీ భువనేశ్వరి మాత్రం తన భర్త సీఎం కావాలని ఎన్నో క్షుద్ర పూజలు( Occult worship ) చేశారు.

Telugu Kills, Lakshmi Parvati, Bhuvaneshwari, Pooja, Sensational-Movie

ఓ అవినీతిపరుడి భార్య మరో అవినీతిపరుడు తల్లి అనే పేరు భువనేశ్వరి తెచ్చుకుందంటూ ఎద్దేవా చేస్తోంది.ఎన్టీఆర్ మహానుభావుడు కారణజన్ముడని.కానీ ఆయనకు జన్మించిన వారు మాత్రం పనికిమాలిన వారిగా మారిపోయారని ఆయన ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నారో తెలియదు కానీ ఆయన కడుపున ఇలాంటి నీచులు పుట్టారు అంటూ నందమూరి కుటుంబ సభ్యులకు ఈమె చేస్తున్నటువంటి ఈ కామెంట్ సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube