వై.వి.ఎస్ చౌదరి దర్శకత్వంలో దేవదాసు ( Devadasu ) సినిమాతో మొదటిసారి టాలీవుడ్ కి పరిచయం అయ్యారు హీరో రామ్ పోతినేని.ఈయన తనకంటే వయసులో పెద్దదైన ఇలియానాతో ఈ సినిమాలో రొమాన్స్ చేశారు.
అంతేకాకుండా దేవదాసు సినిమాకి గానూ రామ్ పోతినేని (Ram Pothineni ) కి ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డు కూడా వచ్చింది.అలా దేవదాసు సినిమాతో తన ప్రస్తానాన్ని మొదలుపెట్టిన రామ్ పోతినేని తాజాగా విడుదలైన స్కంద వరకు ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు.
ఇక ఈయన సినీ కెరియర్లో దేవదాసు సినిమాతో పాటు కందిరీగ, రెడీ, రామ రామ కృష్ణ కృష్ణ,మసాలా, పండగ చేస్కో,శివమ్,నేను శైలజ, ఇస్మార్ట్ శంకర్,ఉన్నది ఒకటే జిందగీ,హలో గురు ప్రేమకోసమే వంటి సినిమాలు ఉన్నాయి.

ఇక ఈ మధ్యనే స్కంద సినిమా ( Skanda movie ) తో అభిమానులను పలకరించినప్పటికీ ఈ సినిమా హిట్టు కి ప్లాఫ్ కి మధ్యలో ఆగిపోయినట్టు కనిపిస్తోంది.ఎందుకంటే మొదటి రోజు పాజిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ కలెక్షన్లు తక్కువ రావడంతో బ్రేక్ ఈవెన్ సాధ్యం అవుతుందా కాదా అనే విధంగా మారిపోయింది.ఇక ఇదిలా ఉంటే తాజాగా టాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం రామ్ పోతినేని ఈ ఏడాది పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారట.

35 సంవత్సరాలు ఉన్న రామ్ పోతినేని బ్యాచిలర్ లైఫ్ కి గుడ్ బై చెప్పి త్వరలోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారని తెలుస్తోంది.ఇక ఉన్నది ఒకటే జిందగీ,హలో గురూ ప్రేమకోసమే వంటి సినిమాల్లో తన సహనటిగా చేసిన అనుపమ పరమేశ్వరన్ ( Anupama parameshwaran ) తో చాలా రోజుల నుండి రామ్ పోతినేని రిలేషన్ లో ఉన్నట్టు టాలీవుడ్ సర్కిల్స్ లో చాలామంది గుసగుసలు పెట్టుకున్నారు.అయితే ఈ విషయాన్ని నిజం చేస్తూ త్వరలోనే ఈ జంట పెళ్లి పీటలెక్కబోతున్నట్టు సమాచారం.ఇక ఇదే నిజమైతే టాలీవుడ్ లో మరో హీరో హీరోయిన్ జంట కపుల్స్ అవుతారు.
మరి ఇప్పటికే ఎన్నోసార్లు రామ్ పోతినేని పై పెళ్లి వార్తలు వినిపించాయి.మరి ఇది కూడా అలాంటి రూమరేనా లేక నిజమేనా అనేది తెలియాలంటే రామ్ పోతినేని క్లారిటీ ఇవ్వాల్సిందే.







