ఇటీవలే కుటుంబాలలో ఏర్పడుతున్న కలహాలు దారుణ హత్యలకు కారణం అవుతున్నాయి.కుటుంబ సభ్యులే మానవత్వం మరిచి దారుణ హత్యలకు పాల్పడుతున్నారు.
మనిషి ప్రాణం తీయడానికి చిన్న చిన్న సమస్యలు, మనస్పర్థలు, అనుమానాలు కారణం అవుతున్నాయి.ఇలాంటి కోవలోనే పెదనాన్న అనే కనికరం లేకుండా గొడ్డలితో అత్యంత దారుణంగా నరికి చంపిన ఘటన ఒడిస్సా లోని( Odisha ) కలహండి జిల్లా భవాని పట్న పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుని గ్రామం ఒక్కసారిగా భయంతో ఉలిక్కిపడేలా చేసింది.
ఈ దారుణ హత్యకు గల కారణాలు ఏమిటో చూద్దాం.

వివరాల్లోకెళితే.కలహండి జిల్లా భవాని పట్న పోలీస్ స్టేషన్ ( Bhawanipatna Police Station ) పరిధిలో ఉండే సికేర్ గుడా గ్రామంలో ఓ 65 ఏళ్ల వృద్ధుడిని తన తమ్ముని కుమారుడు గొడ్డలితో నరికి హత్య చేసి పరారయ్యాడు.స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి చుట్టుపక్కల ఉండే స్థానికులను విచారించారు.65 ఏళ్ల వృద్ధుడు తన తమ్ముడి కుటుంబం పై క్షుద్ర పూజలు, మంత్రాలు( Black Magic ) చేస్తునడంతో తమ్ముని కుటుంబం అనారోగ్యం పాలు అవుతుందనే అనుమానాలు ఆ కుటుంబ సభ్యులు పెంచుకున్నారని గ్రామస్తులు పోలీసులకు తెలిపారు.

దీంతో వృద్ధుని తమ్ముని కొడుకు పెదనాన్న పై కోపం పెంచుకొని పొలంలో ఒంటరిగా పనులు చేసుకుంటున్న సమయంలో గొడ్డలితో దాడి చేశాడని, వృద్ధుడు మృతి చెందిన తర్వాత యువకుడు పారిపోయాడని పోలీసులకు వివరించారు.హత్య కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి, ఆ యువకుడి కోసం గాలిస్తున్నారు.హత్యకు సంబంధించిన వివరాలు దర్యాప్తు అనంతరం వెలుగులోకి వస్తాయని పోలీసులు తెలిపారు.







