సూర్యాపేట జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన కొనసాగుతుంది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
బీజేపీ స్టీరింగ్ ఆదానీ చేతిలో ఉందని కేటీఆర్ అన్నారు.కానీ బీఆర్ఎస్ స్టీరింగ్ మాత్రం కేసీఆర్ చేతుల్లోనే ఉందని స్పష్టం చేశారు.
మజ్లీస్ స్టీరింగ్ అసదుద్దీన్ చేతుల్లోనే ఉందన్నారు.కాగా పాలమూరు వేదికగా నిన్న ప్రధానమంత్రి మోడీ చేసిన వ్యాఖ్యలకు మంత్రి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు.
రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీనే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.