ఈ ఏడాది అక్టోబర్ ఐదు న భారత్( India ) వేదికగా జరుగనున్న వన్డే వరల్డ్ కప్ కోసం భారత క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.భారత్ ఐసీసీ ట్రోఫీ సాధించి దాదాపుగా పది సంవత్సరాలు అయింది.2013లో భారత జట్టుకు మహేంద్రసింగ్ ధోని ( Mahendra Singh Dhoni )కెప్టెన్ గా ఉన్న సమయంలో ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచింది.భారత్ సాధించిన ఐసీసీ ట్రోఫీలో ఇదే చివరిది.
భారత జట్టు అన్ని విభాగాల్లో బలంగా ఉన్న వేరే దేశాల మీద ఆడే సిరీస్ లను గెలుస్తుంది కానీ ఐసీసీ నిర్వహించే ట్రోఫీని గెలవడంలో కాస్త ఇబ్బంది పడుతోంది.

ఇక ఐసీసీ ప్రపంచ క్రికెట్( ICC World Cricket ) వ్యవస్థలో ఇండియానే టాప్ స్థాయిలో ఉంది.ఐసీసీకి అత్యంత రెవెన్యూ జనరేట్ చేసే క్రికెట్ జట్టు కూడా భారత జట్టే కావడం విశేషం.అంతేకాదు ప్రపంచ దేశాలన్నింటికీ కూడా ఇండియా బోర్డు ఒక మార్గదర్శకంగా తయారయింది.
మూడు ఫార్మాట్లలో ఇప్పటికే నెంబర్ వన్ పొజిషన్ ని దక్కించుకున్న భారత జట్టు ప్రపంచంలోని చాలా దేశాల క్రికెట్ అభిమానులకు సైతం ఫేవరెట్ గా నిలిచింది.వన్డే వరల్డ్ కప్ ప్రారంభం అవ్వడానికి మరో నాలుగు రోజుల సమయం మాత్రమే ఉంది.
అయితే భారత జట్టు ఆసియా కప్, ఆస్ట్రేలియా సిరీస్ గెలిచి ఫుల్ ఫామ్ లో ఉంది.ఇక వన్డే వరల్డ్ కప్ లో భారత జట్టు అద్భుతంగా రాణించి టైటిల్ గెలుస్తుందని క్రికెట్ అభిమానులు భావిస్తున్నారు.
గత వరల్డ్ కప్ లో సెమీఫైనల్ లో న్యూజిలాండ్ చేతిలో ఓడి భారత్ వెనుతిరిగింది.

గత పది సంవత్సరాలుగా భారత జట్టు పర్ఫామెన్స్ చూస్తే.2013లో ధోని సారధ్యంలో భారత్ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచింది.2014లో టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో శ్రీలంక చేతిలో భారత్ పోరాడి ఓడింది.2015లో వరల్డ్ కప్ సెమీఫైనల్ లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓడింది.2016లో టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్ లో వెస్టిండీస్ చేతిలో భారత్ ఓడింది.2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ లో పాకిస్తాన్ చేతిలో భారత్ ఓడింది.2019 వరల్డ్ కప్ లో సెమీఫైనల్ లో న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయింది.2021 టీ20 వరల్డ్ కప్ లో గ్రూప్ దశలోనే భారత్ జరిగింది.2022 టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్ లో ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోయింది.ఈ 2023 వన్డే వరల్డ్ కప్ టైటిల్ సాధిస్తుందని క్రికెట్ అభిమానులు ఆశతో ఎదురుచూస్తున్నారు.







